Dhanush: రూ.300 కోట్లతో ధనుష్ ఇల్లు.. మరి ఇల్లాలెక్కడ..!!

Dhanush: రూ.300 కోట్లతో ధనుష్ ఇల్లు.. మరి ఇల్లాలెక్కడ..!!
Dhanush: పిల్లలతో కలిసి జీవితాన్ని గడిపిన ఆ ఇంట్లో ఉండదల్చుకోలేదో ఏమో..

Dhanush: అవడానికి తమిళ హీరో అయినా అన్ని భాషల వారిని ఆకట్టుకున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడై మరింత పాపులారిటీ తెచ్చుకున్నా.. ఐశ్వర్యతో తన 18 వివాహ బంధానికి ముగింపు పలికినట్లు ఇటీవల పేర్కొన్నాడు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని గడిపిన ఆ ఇంట్లో ఉండదల్చుకోలేదో ఏమో ప్రస్తుతానికి ధనుష్ హోటల్‌లోనే బస చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలో ధనుష్ చెన్నైలో ఓ విలాసవంతమైన ఇంటి నిర్మాణం చేపట్టనున్నాడని వార్తలు వస్తున్నాయి. అతడు ఆ ఇంటి కోసం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నాడట. ఇదే నిజమైతే 300 కోట్ల రూపాయల ఇల్లు సొంతం చేసుకున్న ఏకైక హీరోగా ధనుష్ రికార్డు సృష్టించడం ఖాయం. కాగా ధనుష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు.


తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న ధనుష్ రెండు సినిమాలకు కలిపి రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమైతే తన డ్రీమ్ హౌస్‌కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పులేదు.. మరి ఎన్ని హంగులు, ఆర్భాటాలు, ఆధునిక సౌకర్యాలు ఉన్నా ఆలి లేకపోతే ఆ ఇంటికి కళ ఉండదు.. ఆ విషయం ఆ మాత్రం ధనుష్‌కి తెలియకపోదు..


భార్యాభర్తలిరువురి మధ్య పొరపొచ్చాలు పోయి ఇల్లు పూర్తయ్యేనాటికి కలుసుకుంటారేమో.. అదే ఆశతో ఉండి ఉంటారు అటు ఐశ్వర్య కుటుంబసభ్యులు, ఇటు ధనుష్ కుటుంబసభ్యులు. ధనుష్ ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story