Dhanush's Raayan Movie : ఇక ధనుష్ మాత్రమే దిక్కా..?

Dhanushs Raayan Movie : ఇక ధనుష్ మాత్రమే దిక్కా..?
X
టాలీవుడ్ సెకండ్ హాఫ్ గా స్టార్ట్ అయ్యే జూలైలో ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేదు. చివరి వారంలో వస్తోన్న ధనుష్ రాయన్ పైనే అందరి దృష్టీ ఉంది.

టాలీవుడ్ కు ఈ యేడాది పెద్దగా కలిసి రాలేదు. ఫస్ట్ హాఫ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినవి కొన్నే. జూన్ 27న వచ్చిన కల్కి తర్వాత సెకండ్ హాఫ్ గా మొదలైన జూలై కాస్త బెటర్ అవుతుందనుకున్నారు.బట్ ఈ నెలలో విడుదల కావాల్సిన కొన్ని మినీ హీరోల సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇలాంటి టైమ్ ను చిన్న సినిమాలు క్యాష్ చేసుకుంటాయి. బట్ అలా జరగలేదు. ఈ జూలైలో విడుదలైన సినిమాల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. ఆ మాటకొస్తే అసలేం సినిమాలు విడుదలయ్యాయో కూడా ఆడియన్స్ కు తెలియలేదు. అంత పూర్ గా ఉంది బాక్సాఫీస్ పరిస్థితి. థర్డ్ వీక్ గా ఈ నెల 19న ప్రియదర్శి, నభా నటేష్ డార్లింగ్, వినోద్ కిషన్, అనూష కృష్ణ నటించిన పేకమేడలు తో పాటు మరో సినిమా వస్తోంది. బట్ ఈ మూవీస్ పైనా మినిమం బజ్ లేదు. వీళ్లు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తారన్న గ్యారెంటీ కూడా లేదు. ఈ టైమ్ లో జూలై నెలను కాపాడేది రాయన్ అనేలా ధనుష్ వస్తున్నాడు.

ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వస్తోంది "రాయన్". పైగా ఈ మూవీకి తనే దర్శకుడు. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ ఇంటెన్స్ గా ఉంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న కలర్ తో కనిపిస్తోంది. మామూలుగా ఇలాంటి ఇంటెన్స్ డ్రామాలు చేసిన ప్రతిసారీ ధనుష్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ధనుష్ తో పాటు సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ అతని బ్రదర్స్ గా నటించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, ఎస్.జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణా బాలమురళి, దుషారా విజయన్ వంటి బలమైన కాస్టింగ్ కూడా కనిపిస్తోంది. ట్రైలర్ తో చాలా ఇంప్రెషన్ వేసింది టీమ్. రివెంజ్ డ్రామాలా కనిపిస్తున్నా.. ధనుష్ స్టైల్లో కొత్త నేపథ్యం ఉంది. ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఈ నెల 26న తెలుగులోనూ విడుదల కాబోతోంది.

ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 26న మరే సినిమా లేదు. సో.. రాయన్ కు హిట్ టాక్ వచ్చినా చాలు.. మనోళ్లూ బ్లాక్ బస్టర్ చేసేస్తారు. సో.. చూస్తోంటే ఈ జూలై రాయన్ దే కావొచ్చుఅనిపిస్తోంది.

Tags

Next Story