Dhanush: అప్పుడు ఆటో డ్రైవర్ అన్నారు.. ఇప్పుడు అభిమాన హీరో అయ్యాడు

Dhanush: అప్పుడు ఆటో డ్రైవర్ అన్నారు.. ఇప్పుడు అభిమాన హీరో అయ్యాడు
Dhanush: నాన్న రచయిత, అన్న దర్శకుడు.. సినిమాల్లో ఎంట్రీ ఈజీగానే దొరికింది.. అయినే అదేమీ కోరి వచ్చిన ఫీల్డ్ కాదు..

Dhanush: నాన్న రచయిత, అన్న దర్శకుడు.. సినిమాల్లో ఎంట్రీ ఈజీగానే దొరికింది.. అయినే అదేమీ కోరి వచ్చిన ఫీల్డ్ కాదు.. అయిష్టంగానే అడుగుపెట్టినా తన పనికి వంద శాతం న్యాయం చేశాడు ధనుష్. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ హీరో ఏంటా అలా ఉన్నాడు అన్నారు.. అయినా నిరుత్సాహ పడలేదు.. రెట్టింపు ఉత్సాహంతో రెండో సినిమా చేశాడు.. అది కూడా మంచి టాక్ తెచ్చుకుంది..

ఆ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఘోర అవమానాన్ని గుర్తు చేసుకున్నాడు ధనుష్. షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్లు హీరో ఎవరు అని అడిగారు నేరుగా వెళ్లి ధనుష్‌ని. దానికి ధనుష్ కావాలనే మరొకరిని చూపించి అతడే హీరో అని చెప్పాడు.. కానీ సినిమా చూసిన వాళ్లు ఆటో డ్రైవర్‌ని హీరోగా పెట్టారంటని ట్రోల్ చేశారు.. బాడీ షేమింగ్ గురించి ఎన్నో విమర్శలు.. అన్నింటిని అధిగమించి హ్యాండ్‌సమ్ హీరో అనిపించుకుంటున్నాడు.

. ఎన్నో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్నాడు.. తనని విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఆఖరికి హాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి తానేంటో నిరూపించుకుంటున్నాడు.. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా తనపని పైనే శ్రద్ధ పెట్టాడు. ఇప్పడు చాలా మందికి ధనుష్ అభిమాన హీరో అయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story