Dhanush : మాజీ భార్యపై ధనుష్ ట్వీట్.. 'ఏంటన్నా అంత మాట అనేసావ్'..!

Dhanush : కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్యల విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్-ఐశ్వర్య తమ 18 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికారు.. ఇద్దరు విడిపోయాక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.
తాజాగా జానీ మాస్టర్, ఢీ ఫేం శ్రష్టి జంటగా నటించిన 'పయని' అనే మ్యూజిక్ వీడియోకు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. అయితే ఇందులో తమిళ వెర్షన్‌ను సూపర్‌స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా, తెలుగు వెర్షన్ అయిన 'సంచారి'ని అల్లు అర్జున్, మలయాళ వెర్షన్ 'యాత్రక్కారి'ని మోహన్‌లాల్ రిలీజ్ చేశారు.
అయితే ఈ వీడియో గురించి ఐశ్వర్య మాజీ భర్త ధనుష్ ట్వీట్ చేశాడు. 'పయని మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించినందుకు నా స్నేహితురాలు ఐశ్వర్యకు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్' అని ట్వీట్ చేశాడు. ధనుష్-ఐశ్వర్య విడాకుల విషయాన్ని ప్రకటించినప్పటికి ఇంకా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తన పేరు పక్కన ధనుష్ పేరును అలాగే ఉంచేసింది ఐశ్వర్య.
Congrats my friend @ash_r_dhanush on your music video #payani https://t.co/G8HHRKPzfr God bless
— Dhanush (@dhanushkraja) March 17, 2022
కానీ ధనుష్ మాత్రం ఆమెను స్నేహితురాలు అని పిలవడం అభిమానులకి నచ్చడం లేదు. దీనిపైన ధనుష్, ఐశ్వర్య అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏంటన్నా అంత మాట అనేసావ్ అని కామెంట్స్ పెడుతున్నారు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com