Dhanush : ధనుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

Dhanush :  ధనుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
X

కొన్ని కాంబినేషన్స్ పై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఆ కాంబోలో వచ్చిన ప్రీవియస్ మూవీస్ ను బట్టి అదే కనిపిస్తుంది. తమిళ్ లో స్టార్ హీరోగా వెలుగుతూ.. సౌత్ లో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న హీరో ధనుష్ కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న ఆనంద్ ఎల్ రాయ్ ధనుష్ ను బాలీవుడ్ కు పరిచయం చేస్తూ రూపొందించిన రాంఝనా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ధనుష్ కు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చిందీ మూవీతో. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన షమితాబ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా మరోసారి ఆనంద్, ధనుష్ కాంబోలో ‘తేరే ఇష్క్ మే’అనే సినిమా అనౌన్స్ అయింది. చాలా రోజుల క్రితమే ప్రకటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటు హీరోయిన్ డీటెయిల్స్ ను కూడా అనౌన్స్ చేశారు.

తాజాగా ఈ చిత్రంలో ధనుష్ సరసన కృతి సనన్ నటించబోతోందంటూ తనకు సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. విపరీతమైన అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలోకి చేతిలో పెట్రోల్ కేన్ తో వెళుతుంది కృతి. ‘నీ ఆవేశం నాకు భయాన్ని కలిగిస్తుంది. కానీ ఆ భయం నా ఫేస్ లో కనిపించకుండా కవర్ చేసుకున్నా.. నువ్వు గుళ్లు, గోపురాలు, శివాలయాల్లోకి నీ తలను పెడితే నీకు ముక్తి లభిస్తుందేమో’అంటూ ఆ పెట్రోల్ ను ఒంటిపై పోసుకున్న కృతి సనన్ స్టైల్ గా సిగరెట్ వెలిగించుకున్న వీడియో వైరల్ అయింది. ఆనంద్ మరోసారి ఓ బ్యూటీఫుల్ స్టోరీతో వస్తున్నాడని అర్థమయ్యేలా ఉంది. అలాగే ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం హైలెట్ కాబోతోందని ఈ చిన్న వీడియోతనే అర్థం అవుతోంది.

ఇక ఈచిత్రాన్ని నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం అనే ప్రకటన కూడా విడుదల చేశారు. సో.. రిలీజ్ డేట్ ను చాలా ముందుగానే అనౌన్స్ చేశారంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారన్నమాట.

Tags

Next Story