Raayan : మహేష్ మనసు దోచిన ధనుష్ రాయన్

Raayan : మహేష్ మనసు దోచిన ధనుష్ రాయన్
X

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏదైనా మూవీ లేదా వెబ్ సిరీస్ నచ్చితే వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు. కొన్నేళ్ల క్రితం ఏ స్టార్ హీరో కూడా మరో సినిమా గురించి పొగిడేవారు కాదు. బట్ మహేష్ ఆ ట్రెండ్ క్రియేట్ చేశాడు అనే చెప్పాలి. ఆ తర్వాతే మిగతా హీరోలు ఇలా చేయడం మొదలుపెట్టారు. తాజాగా మహేష్ బాబు మనసును దోచాడు ధనుష్. అతను నటించిన రాయన్ మూవీని చూశాడట సూపర్ స్టార్. అంతే వెంటనే ఫిదా అయిపోయాను అంటూ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసుకున్నాడు.

‘రాయన్ స్టెల్లార్ యాక్ట్ బై ధనుష్.. బ్రిలియంట్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్. ఎస్జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ తో పాటు ఇతర కాస్టింగ్ అంతా అద్భుతంగా నటించారు. ఏఆర్ రెహమాన్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో మంటలు రేకెత్తించాడు.. ఏ మస్ట్ వాచ్..’ అని చెప్పాడు సూపర్ స్టార్.

నిజానికి మహేష్ కు సినిమాలు ఓ పట్టాన నచ్చవు అంటారు. ఎంతో బాగుంటే తప్ప అతను ఎగ్జైట్ కాడు. అది కూడా వైవిధ్యంగా ఉందనిపిస్తేనే ఇలా ఓపెన్ గా షేర్ చేసుకుంటాడు. మొత్తంగా ధనుష్ నటన, దర్శకత్వానికి మహేష్ ఫిదా అయ్యాడు అనే చెప్పాలి.

ఇలాంటి సందర్భాల్లో ఆయా మూవీస్ కు కలెక్షన్స్ పెరుగుతాయి. సో.. మహేష్ బాబు ట్వీట్ కూడా రాయన్ కు ఈ వీక్ డేస్ లో ప్లస్ అవుతుందేమో చూడాలి.

Tags

Next Story