Dhanush : తెలుగు మార్కెట్ పైనా కన్నేశారా సార్

Dhanush  :  తెలుగు మార్కెట్ పైనా కన్నేశారా సార్
X

ఒక భాష హీరోల సినిమాలు మరో భాషలోకి డబ్ కావడం కామన్. కానీ కొన్నాళ్లుగా ఇతర భాషా హీరోలు తెలుగు మార్కెట్ పై కన్నేశారు. నేరుగా ఇక్కడే సినిమాలు చేస్తున్నారు. అంతకు ముందే వారికి ఇక్కడ కొంత మార్కెట్ ఉంటే ఇది బోనస్ అవుతుంది. అలాంటి హీరోనే ధనుష్. ధనుష్ కు తెలుగులో కొంత గుర్తింపు ఉంది. మార్కెట్ కూడా ఉంది. అందుకే డైరెక్ట్ తెలుగు మూవీతో ఇంకా తన రేంజ్ ను పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేశాడు. సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందిన సార్ తో 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు.

ప్రస్తుతం తెలుగులోనే శేఖర్ కమ్ములతో కుబేరలో నటిస్తున్నాడు. ఇది చివరి దశలో ఉంది. డిసెంబర్ లో విడుదలవతుందనుకున్నారు. బట్ రీ షూట్స్ ఎక్కువయ్యాయని టాక్. టైటిల్, ఇప్పటి వరకూ వచ్చిన లుక్స్ ఎలా ఉన్నా.. ఇందులో ఇంటెన్స్ యాక్షన్ కూడా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా తెలుగులో సితార బ్యానర్ లోనే మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ధనుష్. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని కూడా వెంకీ అట్లూరినే డైరెక్ట్ చేయబోతున్నారు. అంటే సార్ కాంబో రిపీట్ అవుతుందన్నమాట.

రీసెంట్ గా వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తో మంచి విజయం అందుకున్నాడు. అందుకే ధనుష్ మరోసారి అతన్ని నమ్మాడు. ఈ సారి కూడా వీరి కాంబోలో ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ రాబోతోందంటున్నారు. మొత్తంగా ధనుష్ తెలుగు మార్కెట్ పై స్ట్రెయిట్ గానే ఫోకస్ చేశాడన్నమాట.

Tags

Next Story