విడిపోవడం సరికాదేమో.. కూతుర్ని మరోసారి ఆలోచించమంటున్న తండ్రి

విడిపోవడం సరికాదేమో.. కూతుర్ని మరోసారి ఆలోచించమంటున్న తండ్రి
భర్త భరత్ తఖ్తానీతో విడిపోయే నిర్ణయాన్ని పునరాలోచించాలని కుమార్తె ఈషా డియోల్‌ను ధర్మేంద్ర కోరుతున్నారు.

భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అవి తెగేదాకా తెచ్చుకోకూడదు.. మీరు పరిష్కరించుకోలేని సమస్యలేవైనా ఉంటే పెద్దవాళ్లం మేం ఉన్నాం కదా మాతో పంచుకోండి తల్లీ అని లాలనగా చెబుతున్నారు కూతురు ఈషాకు తండ్రి ధర్మేంద్ర.. మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పిల్లలు అన్యాయం అయిపోతారు.. సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అని కూతురికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రముఖ నటుడు ధర్మేంద్ర కుమార్తె, నటి ఈషా డియోల్ ఇటీవల భర్త భరత్ తఖ్తానీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఒక నివేదిక ప్రకారం, లెజెండరీ స్టార్ ఈ పరిణామంతో చాలా కలత చెందారు. పిల్లల కోసం తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని తండ్రిగా ఆవేదన చెందుతున్నారు.

2012లో వివాహం చేసుకున్న ఈషా, భరత్ లకు ఇద్దరు కుమార్తెలు - రాధ్య, మీరయా. ధర్మేంద్ర తన కుమార్తె నిర్ణయానికి వ్యతిరేకం కానప్పటికీ, ఆమె దాని గురించి మరొకసారి ఆలోచించాలను కోరుకుంటున్నారు.

"ఈషా, భరత్ ఇద్దరూ ధర్మేంద్రను అమితంగా గౌరవిస్తారు. అతను డియోల్ కుటుంబానికి కొడుకు లాంటివాడు, ఇద్దరు కూతుళ్లను తండ్రి ధర్మేంద్ర కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ కూతురు తీసుకున్న నిర్ణయం పట్ల విచారంగా ఉన్నాడు, అందుకే వారు విడిపోవడాన్ని పునరాలోచించాలని అతను కోరుకుంటున్నాడు. రాధ్య, మీరయా అమ్మమ్మ, తాతయ్యలతో చాలా సన్నిహితంగా ఉంటారు. విడిపోవడం పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే పెళ్లిని కాపాడుకోగలమని ధరమ్‌జీ భావిస్తున్నారు."

ఈషా, భరత్ ఇద్దరూ ఫిబ్రవరి 7న తాము విడిపోతున్న వార్తను ప్రకటించారు. ఒక సంయుక్త ప్రకటనలో, వారు మాట్లాడుతూ, "మేము పరస్పరం స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా జీవితంలో ఈ మార్పు ద్వారా, మా ఇద్దరు పిల్లల సంక్షేమానికి ఆటంకం కలగకూడదని భావిస్తున్నాము అని పేర్కొన్నారు. వీరికి వివాహమై 11 ఏళ్లు అయింది.

ఈ జంట విడిపోవడానికి గల కారణాన్ని వెల్లడించనప్పటికీ, ఈషా తన రెండవ బిడ్డ పుట్టిన తర్వాత వారి దాంపత్యంలో కలతలు చోటు చేసుకున్నాయని నివేదికలు పేర్కొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story