Tollywood: HER నుంచి 'ధీరే ధీరే' సాంగ్ రిలీజ్

Tollywood: HER నుంచి ధీరే ధీరే సాంగ్ రిలీజ్
X


రుహాణి శర్మ నటించిన HER నుంచి 'ధీరే ధీరే' సాంగ్ రిలీజ్ అయింది. చిలసౌ మూవీతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్నా రుహాణీ... క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమాలు చేస్తున్నారు. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించగా.. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఇందులో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. HER సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు విడుదల చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా... ఓ మెలోడీ పాటను రిలీజ్ చేసింది చిత్ర యునిట్.

'ధీరే ధీరే' అంటూ సాగే పాట శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో రుహాని శర్మ రొమాంటిక్ టచ్ ఇచ్చింది. ఈ పాటకు పవన్ బాణీ, మహేష్‌ పొలొజు సాహిత్యం, ఆకాంక్ష బిస్త్ గాత్రం అందించారు.

Tags

Next Story