MS Dhoni: ధోనీ మొదటి చిత్రం.. లవ్ టుడే హీరోయిన్‌కి అవకాశం

MS Dhoni: ధోనీ మొదటి చిత్రం.. లవ్ టుడే హీరోయిన్‌కి అవకాశం
MS Dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

MS Dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన మొదటి చిత్రానికి రమేష్ తమిళ్మణి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు హరీష్ కళ్యాణ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. జనవరి 27న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ చిన్న బడ్జెట్ చిత్రంతో తన నిర్మాణాన్ని ప్రారంభిస్తోంది. హరీష్ కళ్యాణ్ హిట్ చిత్రం ప్యార్ ప్రేమ కాదల్‌తో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. నటి ఇవానా.. నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తీసిన లవ్ టుడే చిత్రంలో నటించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ యువ నటులు ఇద్దరూ తమ కెరీర్‌లో రాణిస్తున్న క్రమంలో ధోని నిర్మిస్తున్న చిత్రంలో వారికి అవకాశం వచ్చింది.

కాగా, ఈ చిత్ర దర్శకుడు రమేష్ తమిళ్మణికి ఇది తొలి చిత్రం. అతడికి ధోనీతో ఉన్న అనుబంధం కారణంగా ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. జనవరి 26న సినిమా ప్రకటనకు సంబంధించిన కామన్ పోస్టర్‌ను ఆయన ట్వీట్ చేశారు.

అక్టోబర్ 2022లో ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ప్రకటన వెలువడిన మూడు నెలల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు పట్టాలెక్కింది. ధోనీ నిర్మాణ రంగంలో కూడా విజయం సాధించాలని, ఆయన నిర్మించిన చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story