ఫ్రైడే రేస్ లో గెలిచిన ధూమ్ ధామ్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ధూమ్ ధామ్. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన అప్లాజ్ వస్తోంది. ఆల్రెడీ ప్రీమియర్స్ కే మంచి రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూసిన వారిన మనసులు గెలుచుకుంటోందీ చిత్రం. ఈ మధ్య కాలంలో ఇంతలా నవ్వించిన సినిమా రాలేదు అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటేనే ఆ కుటుంబాల మధ్య ప్రేమకథలు నలిగిపోతుంటాయి. అందులో నుంచి మంచి హాస్యాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా దర్శకుడు మచ్చా సాయి కిశోర్ చేసింది అదే.
ఓ మంచి కుటుంబ కథకు చక్కని హాస్యాన్ని రంగరిస్తే.. ప్రేక్షకులను రంజింప చేయడం సులువే అని మరోసారి ప్రూవ్ చేశాడు అతను. చేతన్ నటనలో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హెబ్బా నటనతో పాటు గ్లామర్ కూ మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ కడుపుబ్బా నవ్వించేలా ఉంది. తనదైన టైమింగ్ తో స్క్రీన్ మొత్తం ఆడేసుకున్నాడు వెన్నెల కిశోర్.
ఈ సినిమాకు ఉన్న మరో హైలెట్ ఏంటంటే.. ప్యాడింగ్ ఆర్టిస్టులంతా సీనియర్స్. వాళ్లందరూ బాగా తెలిసిన వాళ్లు కావడంతో టైమింగ్ తో పాటు క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ అయ్యాయి.ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ను పండించడంలో వీరి సీనియారిటీ సినిమాకు బాగా ప్లస్ అయింది. మొత్తంగా టైటిల్ కు తగ్గట్టుగానే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ధూమ్ ధామ్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోందీ మూవీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com