Sanjay Gadhvi : గుండెపోటుతో 'ధూమ్ 2' డైరెక్టర్ మృతి

Sanjay Gadhvi : గుండెపోటుతో ధూమ్ 2 డైరెక్టర్ మృతి
X
బాలీవుడ్ లో విషాదం.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన 'ధూమ్ 2' డైరెక్టర్ సంజయ్ గాధ్వి

డైరెక్టర్ సంజయ్ గాధ్వి నవంబర్ 19 ఆదివారం మరణించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సంజయ్ 'ధూమ్', 'ధూమ్ 2' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండూ హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ లకు భారీ విజయాన్ని తెచ్చి పెట్టాయి. అతని స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం సంజయ్ సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్‌కు వెళ్లాడు. సంజయ్ 'మేరే యార్ కి షాదీ హై', ఇమ్రాన్ ఖాన్ నటించిన 'కిడ్నాప్' చిత్రాలకు కూడా దర్శకుడు. 2012లో 'అజబ్ గజబ్ లవ్', 2020లో 'ఆపరేషన్ పరిందే' చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కాగా ఆయన అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంజయ్ గధ్వి 2000లో 'తేరే లియే'తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కానీ ఆ మూవీ అంతగా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అర్జున్ రాంపాల్, రవీనా టాండన్ జంటగా నటించిన ఈ చిత్రానికి గతంలో 'తు హి బటా' అనే టైటిల్ పెట్టారు. అయితే తక్కువ బడ్జెట్‌తో సినిమా ఆగిపోయింది. 2004లో యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ధూమ్‌'కి దర్శకత్వం వహించి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, రిమీ సేన్, హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్, బిపాసా బసు నటించిన 'ధూమ్ 2' సీక్వెల్ వచ్చింది. ధూమ్ సిరీస్ యశ్ రాజ్ ఫిల్స్మ్ ని అందనంత ఎత్తుకి తీసుకెళ్లింది. ఇక 'ధూమ్ 2' తర్వాత సంజయ్.. కిడ్నాప్, అజబ్ గజబ్ లవ్, ఆపరేషన్ పరిందే వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కానీ అవి అంతగా విజయం సాధించలేదు.

Tags

Next Story