ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ధూమమ్

ఫహాద్ ఫాసిల్ నటించిన ధూమమ్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంది. ఫహాద్ పాత్ర గతంలో జరిగిన విషయాలను మర్చిపోతూ ఉంటుంది. ఇలాంటి జానర్ లో గజిని సినిమా వచ్చింది. తమిళ్, తెలుగులో సూర్య , హిందీలో అమీర్ ఖాన్ నటించారు. ధూమమ్ లో రోషన్ మ్యాథ్యూ, అపర్ణ బాలమురళి నటించారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. తక్కువ బడ్జెత్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్శిస్తోంది. ఇందులో అత్యుత్తమ సాంకేతిక అంశాలు, దర్శకత్వ ప్రతిభ ఉందని ప్రేక్షకులు తమ ఫీడ్ డ్యాక్ ను ఇచ్చారు. అయినప్పటికీ ఈ చిత్రంలోని థ్రిల్లర్ ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకునేలా ఉందని చిత్ర యునిట్ తెలిపింది.
ఫదాహ్ ఫాసిల్ నటన అద్భుతంగా ఉందని చెబుతున్నారు సినీ ప్రేమికులు. ఈ సినిమాను పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఫదాహ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పవన్ ముందుగా తనకు నికోటిన్ అనే స్క్రిప్ట్ ను అందించినట్లుగా తెలిపారు. అయితే అది కాస్తా 'ధూమమ్' గా మారిందని చెప్పారు. కరోనా ప్యాండమిక్ కన్నా ముందు స్క్రిప్ట్ రెడీ అయిందని తెలిపారు. ముందుగా ఈ సినిమా మలయాళంలో తీయాలని అనుకోలేదని చెప్పారు. చాలా చర్చల అనంతరం మలయాళంలోనే ఫిక్స్ అయ్యామని తెలిపారు. ఈ రోజు విడుదలైన ధూమమ్ విమర్శకులను సైతం ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com