Dhruv Vikram : రొమాంటిక్ మూవీతో ధృవ్ విక్రమ్

Dhruv Vikram :  రొమాంటిక్ మూవీతో ధృవ్ విక్రమ్
X

హీరోగా అనుకున్నది సాధించాడు ధృవ్ విక్రమ్. బట్ విజయం పరంగా మాత్రం తండ్రి చాటుగా మిగిలిపోయాడు. ఆ మిగులుపాటును బైసన్ మూవీతో తొలగించుకున్నాడు. బైసన్ మూవీతో సోలోగా సత్తా చాటాడు. మారి సెల్వరాజ్ అతని స్టైల్లోనే రూపొందించిన సినిమా ఇది. అందుకే మంచి విజయం కూడా సాధించాడీ మూవీతో. బైసన్ తర్వాత ఏంటీ అనే డౌట్ కాస్త ఎక్కువగా ఉన్నట్టు ఉంది అతనికి. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఈ సారి రోమ్ కామ్ మూవీతో రాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోన్న మూవీ ఇది. దీపక్ రెడ్డి అనే తెలుగు దర్శకుడే ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను ఫిక్స్ చేశారు.

మామూలుగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ మధ్య తమిళ్ లో కూడా వరుసగా మూవీస్ చేస్తున్నారు. ధృవ్ విక్రమ్ లాంటి హీరోతో మూవీ అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ కే సేఫ్ అనిపించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు దీపక్ రెడ్డి లాంటి కొత్త దర్శకుడుతో సినిమా అనేది ప్లస్ అవుతుంది. కొత్తవాళ్లు అంటే కొత్త కంటెంట్ కూడా వస్తున్నట్టుగా భావించొచ్చు. పైగా ఇది తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదలవుతుంది. ఆ రకంగానూ ఈ ప్రాజెక్ట్ సేఫ్ అవుతుంది. మొత్తంగా బైసన్ తర్వాత ధృవ్ విక్రమ్ రొమాంటిక్ కామెడీ మూవీతో రాబోతున్నాడు అని తెలిసిపోయింది.

Tags

Next Story