Dhurandhar 2 : ధురంధర్ 2 ట్రైలర్ వచ్చింది.. ఇంక సినిమానే

రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో అతని నటనకు చాలామంది ఫిదా అయిపోయారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉన్నాయనే కితాబు వచ్చింది. ఆ మూవీ గతేడాది డిసెంబర్ 5న విడుదలైంది. అఖండ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ మూవీ సీక్వెల్ కూడా వెంటనే విడుదల చేయాలని ఫిక్స్ అయింది టీమ్. ఈ మూవీ సీక్వెల్ ను ఈ మార్చి 19న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మూవీ ట్రైలర్ త్వరగా వస్తే బావుండు అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఓ దశలో ఈ మూవీ ట్రైలర్ ఈ 6న విడుదల చేయకపోతే మూవీ పోస్ట్ పోన్ అవుతుందని కూడా చెప్పారు. బట్ అందరి కోసం ఈ మూవీ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సింప్లీ సూపర్బ్ అనిపించింది.
ట్రైలర్ తర్వాత ఈ మూవీ కూడా ఓ రేంజ్ లో ఉండబోతోంది అనిపించేలా ఉంది. ముఖ్యంగా ఫైట్స్.. ఫస్ట్ పార్ట్ కంటే కూడా చాలా బావుండబోతున్నాయి అనిపించేలా ఉంది. అదే టైమ్ లో మూడు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ నిడివి చూస్తే.. ఈమూవీ కథ ఏ మాత్రం రివీల్ కాకుండా కట్ చేసినట్టు కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో మరోసారి అదరగొట్టబోతున్నట్టు ఉంది. అయితే ఈ సారి ట్రైలర్ లో సారా అర్జున్ కనిపించలేదు. ఆమె క్యారెక్టర్ ను ఎలా ఎండ్ చేయబోతున్నారో మరి చూడాలి. మొత్తంగా దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సారి కూడా ప్రామిసింగ్ మూవీతోనే వస్తున్నట్టుగా ఉన్నాడు. అతని విజన్ క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ సారి ప్యాన్ ఇండియా స్థాయిలో మూవీని విడుదల చేయబోతున్నారు. మరి ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
