Dhurandhar 3 : ధురంధర్ 3 కూడానా..?

Dhurandhar 3 :  ధురంధర్ 3 కూడానా..?
X

ధురంధర్ మూవీ ఏ టైమ్ లో వచ్చిందో కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ కేవలం హిందీలోనే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఇమ్మీడియెట్ గా సీక్వెల్ అనౌన్స్ చేశారు. సీక్వెల్ అంటే ఆ తర్వాతి చేయబోయే మూవీ కాదు. ఆల్రెడీ చేసిన మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్. 2025 డిసెంబర్ 5న విడుదలైంది ఈ మూవీ. వెంటనే 2026 మార్చి 19న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ డేట్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా ఈ సారి ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు. సో ధురంధర్ 2పై ఇప్పుడు భారీ అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా బిగ్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించేలా ఉంది. ఓ రకంగా చూస్తే ఇది బాహుబలి 2, పుష్ప 2 కలెక్షన్స్ ను కూడా దాటేసే కెపాసిటీ ఉంది.

రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఉరి ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేశాడు. అతని టేకింగ్ కు ఫస్ట్ పార్ట్ కే మైండ్ పోయింది. అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇప్పటికీ ప్రీ సేల్స్ తోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇలా రిలీజ్ కు ముందే అడ్వాన్స్ ప్రీ సేల్స్ ద్వారా ఏకంగా 100 కోట్లు సాధించిన మూవీ ఇండియాలో ఇప్పటి వరకు లేదు. ఆ స్థాయిలో ఉంది ఈ మూవీపై క్రేజ్.

మరి ఈ స్థాయిలో క్రేజ్ రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకే ఈ మూవీకి మరో పార్ట్ కూడా ఉండబోతోంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే ధురంధర్ 3 అన్నమాట. ఇదే విషయాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ కు చెప్పారు. బట్ ఈ విషయాన్ని ఆదిత్య ధర్ ఖండించాడు. ఇప్పటి వరకు ఈ మూవీకి మూడో భాగం అనే ఆలోచనలే లేదు. కేవలం సెకండ్ పార్ట్ తోనే సినిమా అయిపోతుంది. కావాలని మూడో భాగం చేయడం అంత సమంజసం కాదు అన్నాడు. మరి ఈ సెకండ్ పార్ట్ పై కూడా భారీ రిజల్ట్ వస్తే.. థర్డ్ పార్ట్ పైనా ఆశలు పెరుగుతాయోమో చూడాలి.

Tags

Next Story