Ileana: తన బిడ్డకు తండ్రిని పరిచయం చేసినట్టేనా...?

దశాబ్దకాలంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఇలియానా ఇప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. ప్రస్తుతం ఆవిడ గర్భంతో ఉంది. రెండు మూడు నెలల్లో బిడ్డకు జన్మనివ్వనుంది. బాలీవుడ్ హీరోయిన్ కత్రిన కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. 2022 నుంచి వీరిద్దరు కలిసి ఉంటున్నారు. కత్రిన కైఫ్ పుట్టిన రోజు వేడుకలో ఇలియానా మిచెల్ తో కనిపించడంతో మొదటిసారి వారి రిలేషన్ గురించి బయటకు తెలిసింది.
ఇలియానా తాజాగా గర్భంతో ఉన్న ఫొటో పెట్టి తాను మంచి భాగస్వామిని పొందినట్లు తెలిపింది. అందులో నటి సెబాస్టియన్ తో కలిసి ఉంది. తన కష్టంలో, ఒత్తిడిలో ఎప్పుడూ తనతో ఉన్నాడని చెప్పింది. అయితే ఇప్పటివరకు ఇలియానా తన బాగస్వామిని గోప్యంగా ఉంచింది. బేబీ మూన్ లో ఈ జంట ఓ ద్వీపానికి వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నారు.
"నేను కష్టకాలంలో ఉన్న రోజుల్లో ఈ వ్యక్తి నాజీవితంలోకి వచ్చాడు. నిరాశలో ఉన్న నన్ను తట్టిలేపాడు. నా కన్నీళ్ల తుడిచాడు. హస్యంతో నన్ను నవ్వించాడు. ఇలాంటి వ్యక్తి నాజీవితంలోకి రావడం సంతోషాన్నిచ్చింది." అని రాసుకొచ్చింది ఇలియానా. పోస్ట్ ను చూసిన ఆవిడ స్నేహితులు హ్యానీ ఏమోజీతో అభినందనలు తెలుపుతున్నారు. గతంలో ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో చాలా సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉంది. ఆ పెళ్లిని చాలా ప్రేవేట్ గా ఉంచారు. అయితే ఇప్పుడు వారు విడిపోయారా లేదా అనే విషయం రహస్యంగా ఉంచారు.
Tags
- Ileana D
- ileana d'cruz
- ileana d'cruz pregnant
- ileana d'cruz boyfriend
- ileana finally reacts on her struggle
- ileana dcruz
- ileana d'cruz husband
- ileana d'cruz bf sebastien laurent michel
- ileana d'cruz finally reacts on weight gain
- ileana dcruz pregnant
- ileana dcruz boyfriend
- actress ileana d'cruz announces her pregnancy
- ileana d'cruz baby bump
- ileana dcruz bf katrina kaif brother sebastien
- ileana d'cruz pregnancy news
- ileana d'cruz is dating katrina's brother sebastian
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com