KGF 2 : కేజీఎఫ్: రియల్ రాకీ భాయ్ ఎవరో తెలుసా?

KGF 2 : కేజీఎఫ్: రియల్ రాకీ భాయ్ ఎవరో తెలుసా?
KGF 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొడుతోంది.

KGF 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొడుతోంది. భారీ కలెక్షన్లు రాబడుతున్న ఈ మూవీని తన కొడుకు థంగం జీవితం ఆధారంగా తెరకెక్కించారని తన తల్లి ఆరోపిస్తోంది.. ఈ మేరకు ఆమె ఈ సినిమా పైన కోర్టులో ఓ కేసు వేశారు. తన కొడుకు పాత్రను సినిమాలో నెగిటివ్‌గా చూపించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సమయంలోనే ఆమె ఈ కేసు వేశారు.

ఇంతకీ ఈ థంగం ఎవరు?

1990ల్లో కరడుకట్టిన నేరస్థుల్లో థంగం ఒకరు.. కోలార్ లో పనిచేసే ఆయన గ్యాంగ్ భారీ మొత్తంలో బంగారాన్ని దోచుకెళ్లేది.. ఆయన్ని అప్పుడు జూనియర్ వీరప్పన్ గా పిలిచేవారు కూడా.. అలా దోచుకున్న బంగారాన్ని ప్రజలకు పంచుతుండేవారు. దీనితో ఆయనకి వారి నుండి మద్దతుతో పాటుగా మంచి పేరు కూడా ఉండేది. కేవలం నాలుగేళ్లలో థంగంపై 42 దోపిడీ కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో థంగం కనిపిస్తే కాల్చి చంపేయాలని షూటింగ్ ఆర్డర్స్ కూడా ఆయనపై జారీ అయ్యాయి. దీనితో 1997లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో పోలీసులతో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో థంగం మరణించాడు. అయితే థంగం తల్లి చేసిన ఆరోపణలను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కొట్టిపారేశారు.. కేజీఎఫ్‌, థంగంల మధ్య ఎలాంటి సంబంధమూలేదని ఆయన అన్నారు. కాగా కన్నడలో గతంలో ''కోలార్''అనే సినిమాని థంగం జీవితం ఆధారంగా తెరకెక్కించారు.

Tags

Read MoreRead Less
Next Story