Maruti : రాజా సాబ్ ఫ్లాప్ ను మారుతి లైట్ తీసుకున్నాడా

Maruti :  రాజా సాబ్ ఫ్లాప్ ను మారుతి లైట్ తీసుకున్నాడా
X

ప్రభాస్ హీరోగా వచ్చిన రాజా సాబ్ దారుణమైన పరాజయం చూసింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలుచుంది. కనీసం సంక్రాంతి సందర్భంగా కూడా ఆకట్టుకోలేకపోయిందీ మూవీ. నిర్మాత కూడా భారీగా లాస్ అయిపోయాడు. అలాంటి మూవీ తర్వాత మారుతి అంత ఈజీగా కోలుకోవడం కష్టం అనుకున్నారు. బట్ అలాంటిదేం లేదు. అతను రాజా సాబ్ డిజాస్టర్ ను లైట్ తీసుకున్నాడు అనిపిస్తోంది. ఎందుకంటే అతను ఆల్రెడీ నెక్ట్స్ మూవీ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు.

రాజా సాబ్ లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత ఏ దర్శకుడైనా అంత సులువుగా కోలుకోవడం కష్టం అనుకున్నారు. కానీ మారుతి మాత్రం అదేమీ సీరియస్ గా తీసుకున్నట్టు తెలియడం లేదు. దానికి తోడు అతను ఆల్రెడీ ఈ మూవీ బిగ్ డిజాస్టర్ గ్యారెంటీ అనిపించేలా ప్రమోషన్స్ లో కనిపించాడు. అందుకే ముందే రాజా సాబ్ డిజాస్టర్ పై ముందుగానే ప్రిపేర్ అయినట్టుగా తెలిసింది. ఆ కారణంగా అతని నెక్ట్స్ మూవీ కోసం ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ మూవీకి ‘హ్యాపీ పొంగల్’అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ కథ కూడా సిద్ధంగా ఉందట. త్వరలోనే ఈ మూవీలో నటించే హీరో, హీరోయిన్లకు సంబంధించిన విషయం చెప్పబోతున్నాడు మారుతి.

నిజమే.. ఫ్లాప్స్ వచ్చాయి కాబట్టి కుంగిపోకూడదు. మళ్లీ అదే ఫీల్డ్ లో మరో సాలిడ్ హిట్ తో సత్తా చాటాలి. అదే మారుతి చేయబోతున్నాడు. అతని గత చిత్రాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా నెక్ట్స్ మూవీతో మళ్లీ ఆకట్టుకోవాలి. అప్పుడే ఈ డిజాస్టర్ ను మర్చిపోతారు. ఒకవేళ ఇదీ పోయిందీ అంటే అప్పుడు అతని కెరీర్ మొత్తంలో ప్రశ్నార్థకంలో పడిపోతుంది. అప్పటి వరకు అతని ప్రయత్నాలు ఎందుకు ఆపాలి.

Tags

Next Story