Mohan Babu : న్యూజీలాండ్ లో మోహన్ బాబు 7 వేల ఎకరాలు కొన్నాడా..?

Mohan Babu :  న్యూజీలాండ్ లో మోహన్ బాబు 7 వేల ఎకరాలు కొన్నాడా..?
X

మంచు మోహన్ బాబు, విష్ణు కలిసి న్యూజీలాండ్ దేశంలో 7వేల ఎకరాలు కొన్నారు అనే వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమేరకు ఆ విషయాన్ని ఆ ఇద్దరే చెబుతూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. దీంతో కొందరు ఎప్పట్లానే వారిని ట్రోల్ చేస్తూ సెటైర్స్ వేసతున్నారు. మీమ్స్ కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం వీరి బ్యానర్ లో రూపొందిన కన్నప్ప చిత్రం న్యూజీలాండ్ లోనే మేజర్ పార్ట్ చిత్రీకరించారు. దీంతో ఇది నిజమే అని కూడా కొందరు అనుకుంటున్నారు. బట్ అందులో ఎలాంటి నిజం లేదు అని కన్నప్ప చిత్రంలో నటించిన బ్రహ్మాజీ చెప్పాడు. ఇది జస్ట్ ప్రాంక్ వీడియో మాత్రమే చెప్పాడు. ఆ ఇద్దరూ ఫన్ మూడ్ లో ఉన్న టైమ్ లో 7వేల ఎకరాల గురించి చెప్పేలా తనే రెచ్చగొట్టానని.. కానీ కొందరు ఇది నిజం అనుకుంటున్నారన్నాడు. అంతే కాదు.. అసలు న్యూజీలాండ్ దేశంలో ఆ దేశ పౌరులు కాని వారికి ఇంత భూమిని పొందే హక్కు ఉండదని స్పష్టం చేశాడు బ్రహ్మాజీ. దీంతో ఈ ఏడు వేల ఎకరాలు అనేది ఉత్తిదే అని తేలిపోయింది. కేవలం ప్రాంక్ గానే తండ్రి కొడుకులు ఆ వీడియోలో కనిపించారు అనేది తేలిపోయింది.

ఇక ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన కన్నప్ప ఈ నెల 27నే విడుదల కాబోతోంది. మొదలుపెట్టినప్పుడు కొంత నెగెటివిటీ ఉన్నప్పటికీ ట్రైలర్ తర్వాత పాజిటివ్ బజ్ స్టార్ట్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరగడంతో మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా హ్యాపీగా ఉన్నారు.

Tags

Next Story