Jr. NTR : ఎన్టీఆర్ మరో ప్రాజెక్ట్ ఓకే చేశాడా

Jr. NTR : ఎన్టీఆర్ మరో ప్రాజెక్ట్ ఓకే చేశాడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన స్పాన్ ను పెంచుకుంటున్నాడు. దేవర మూవీతో ఈ సెప్టెంబర్ 27న రాబోతున్నాడు. రెండు భాగాలుగా రూపొందే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ను బట్టే నెక్ట్స్ పార్ట్ ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు బాలీవుడ్ డెబ్యూ మూవీగా ‘వార్ 2’ చేస్తున్నాడు. ఇందులో మరో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తో కమిట్ అయి ఉన్నాడు. నిజానికి వార్ 2 డేట్స్ లో ప్రశాంత్ తోనే సినిమా చేయాలి. కానీ లైనప్ మారింది. కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ నీల్ ఈ మూవీ ఆగస్ట్ లోనే స్టార్ట్ అవుతుందని చెప్పాడు. అది నిజమా కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది. అయితే ప్రశాంత్ నీల్ మూవీని 2025 ఆగస్ట్ లో విడుదల చేయాలనే ప్లాన్ అయితే ఉందట. నెక్ట్స్ దేవర 2 ఉండే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ను బట్టే అంటున్నారు. కాబట్టి ఆ తర్వాత ఎవరితో అనే ప్రశ్నకు ఆల్రెడీ ఆన్సర్ దొరికేసిందని టాక్.

నానితో హాయ్ నాన్న అనే మూవీ రూపొందించన దర్శకుడు శౌర్యుతో ఎన్టీఆర్ మూవీ సెట్ అయిందని టాలీవుడ్ టాక్. విశేషం ఏంటంటే.. ఇది కూడా రెండు భాగాలుగా ఉంటందట. ఫస్ట్ పార్ట్ ను 2026 సెకండ్ హాఫ్ లో కుదిరితే దసరాకు విడుదల చేస్తారట. రెండో భాగాన్ని 2028లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట. అప్పటికి ఎన్టీఆర్ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి రెండో భాగం అందుకు తగ్గట్టుగానే ఉంటుందని టాక్. శౌర్యుకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఎన్టీఆర్. అతనికి కావాల్సినంత టైమ్ ఉంది.. సో స్క్రిప్ట్ ను ది బెస్ట్ గా మార్చుకుంటూ వెళుతూ.. ఫైనల్ అవుట్ పుట్ ఏ డౌట్ లేకుండా రెడీ కావొచ్చు. సో.. 2028 వరకూ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండబోతున్నాడన్నమాట.

Tags

Next Story