Pooja Hedge: పూజ-పవన్ కాంబినేషన్ సెట్.. కానీ బుట్టబొమ్మ అవుట్

Pooja Hedge: పూజ-పవన్ కాంబినేషన్ సెట్.. కానీ బుట్టబొమ్మ అవుట్
Pooja Hedge: స్టార్ హీరోల సరసన ఆఫర్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్‌ అయితే చెప్పేదేముందీ..?

Pooja Hedge: స్టార్ హీరోల సరసన ఆఫర్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్‌ అయితే చెప్పేదేముందీ..? నెంబర వన్ పొజిషన్ లో ఉన్న బ్యూటీస్ కూడా పవర్‌ స్టార్ అంటే చాలు.. వెంటనే కాల్షీట్స్ ఇచ్చేస్తారు. కానీ ఈ బుట్ట బొమ్మ మాత్రం వద్దనుకుంది.. ఎందుకని అని అడిగితే పవన్ కళ్యాణ్ కోసం నేను ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. దర్శకుడు కోసం యస్ చెప్పానంది. మరి దర్శకుడి కోసమైనా ఉండొచ్చు కదా అంటే దానికీ అమ్మడి దగ్గర ఆన్సర్ ఉంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే..


పూజా హెగ్డే.. తెలుగుతో పాటు తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్ చిత్రాలతో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్‌ను కూడా ఎంటర్టైన్ చేసింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్నా.. బాలీవుడ్ లోనూ జెండా పాతాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన సర్కస్ 23న విడుదల కాబోతోంది. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్‌ బాబు - త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందే సినిమాలోనూ పూజానే హీరోయిన్.




అయితే చాలాకాలం క్రితమే పూజాహెగ్డే.. హరీశ్ శంకర్ - పవన్ కళ్యాణ్‌ సినిమాలో హీరోయిన్ గా ఓకే చెప్పింది. భవదీయుడు భగత్ సింగ్‌గా చెప్పుకున్న ఈ ప్రాజెక్ట్ బాగా లేట్ అవుతోంది. దీన్నే ఉస్తాద్ భగత్ సింగ్ అని టైటిల్ మార్చారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదని భావించినట్లుంది. అందుకే తప్పుకుంది. నిజానికి పూజాహెగ్డేకు తెలుగులో గుర్తింపు తెచ్చిన సినిమా డిజే.. దువ్వాడ జగన్నాథమ్. ఈ మూవీకి దర్శకుడు హరీశ్ శంకర్.




అందుకే అతడి డైరెక్షన్ అనేసరికి ఆలోచించకుండా ఓకే చెప్పింది. కానీ ఈ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్‌ పొలిటికల్ టూర్స్ వల్ల బాగా లేట్ అవుతోంది. పైగా మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. సో.. పవన్ గ్యారెంటీగా ఈ మూవీకి కామా పెట్టి తన వారాహి ఎక్కి ప్రచారాలకు వెళతాడు. అప్పుడు తన ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అతను వచ్చిన తర్వాత మళ్లీ డేట్స్ అంటే ఆ టైమ్ కు తను ఎక్కడ ఏ సినిమాతో బిజీగా ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఎందుకు అనే.. ఈ మూవీ నుంచి కామ్ గా తప్పుకుందంటున్నారు. అయినా వదిలితే పవన్ వదలాలి కానీ.. ఈవిడ పవన్ ప్రాజెక్ట్ వదులుకోవడం ఏంటో.

Tags

Read MoreRead Less
Next Story