Raayan : రాయన్ తప్పు చేశాడా..

ఏ స్టార్ హీరో అయినా తన కెరీర్ లో 50వ సినిమా చేస్తున్నాడు అంటే కంటెంట్ పరంగానే కాదు.. రిలీజ్ పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. పైగా ప్యాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరో అయితే ఇంక చెప్పేదేముందీ అన్ని భాషల ప్రేక్షకులకు తన మైల్ స్టోన్ లాంటి మూవీని చూపించాలని ఆరాటపడుతుంటాడు. బట్ ఈ విషయంలో ధనుష్ తప్పు చేశాడు అనిపిస్తోంది. ఈ శుక్రవారం విడుదలైన రాయన్ మూవీకి సంబంధించి తెలుగులో అస్సలు ప్రమోషన్స్ చేయలేదు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ మార్కెట్ అంటే తెలుగు. అలాంటి తెలుగును నిర్లక్ష్యం చేయడం వల్ల రాయన్ కు రావాల్సినంత రెవిన్యూ రాకపోవచ్చు అనే చెప్పాలి. కేవలం ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే చేశారిక్కడ. అంతకు మంచి నో ఇంటర్వ్యూస్, నో ఇంటరాక్షన్స్. ఈ కారణంగా ఓపెనెంగ్స్ పై ప్రభావం పడింది. సినిమాకు పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత బుకింగ్స్ కొంత పికప్ అయ్యి ఉండొచ్చు. కానీ పెద్ద ఓపెనింగ్స్ తో వచ్చే మౌత్ టాక్ ఖచ్చితంగా ఎసెట్ గా నిలిచేదే. వీళ్లు అసలు ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల కొన్ని చోట్ల ఈమూవీ రిలీజ్ అయిన విషయం కూడా తెలియకుండా పోయింది.
రాయన్ లో బలమైన కంటెంట్ ఉంది. మాస్ ను మెప్పించే అన్ని అంశాలు ఉన్నాయి. అర్బన్ తో పాటు రూరల్ ఆడియన్స్ కు కూడా మెప్పించేంత విషయం ఉంది. ఇలాంటి మూవీస్ ను ప్రమోట్ చేసుకోకుండా వదిలేసుకోవడం ఖచ్చితంగా పెద్ద తప్పు అనే చెప్పాలి,. ఇక్కడ తెలుగులో విడుదల చేసిన వాళ్లైనా ఆ దిశగా ప్రయత్నించి ఉండాల్సింది. ఏదేమైనా కొన్నాళ్లుగా సరైన హిట్ లేక వెలవెలబోతోన్న టాలీవుడ్ మార్కెట్ ను క్యాష్ చేసుకునే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నాడు ధనుష్. లేదంటే రాయన్ సౌండ్ ఇప్పుడు వేరేలా ఉండేదేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com