Shah Rukh Khan : 'జవాన్' కు సల్మాన్ ప్రమోషన్.. క్లారిటీ ఇచ్చిన షారుఖ్

Shah Rukh Khan : జవాన్ కు సల్మాన్ ప్రమోషన్.. క్లారిటీ ఇచ్చిన షారుఖ్
బట్టతలతో కనిపించిన సల్మాన్.. 'జవాన్' కోసమేనంటున్న నెటిజన్లు.. కానీ

కొన్ని రోజుల క్రితం, సల్మాన్ ఖాన్ ఓ కొత్త లుక్‌లో కనిపించాడు. బట్ట తలతో అందర్నీ ఆకర్షించాడు. దీన్ని చూసిన అభిమానులు అతని కొత్త రూపాన్ని ఇష్టపడుతుండగా, చాలా మంది నెటిజన్లు మాత్రం సల్మాన్ కొత్త రూపంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం 'జవాన్‌'ను ప్రమోట్ చేయడానికి సల్మాన్ అలా బట్టతలతో వచ్చాడా అని కొందరు ఆశ్చర్యపోయారు. 'జవాన్' లో SRK బట్టతలతో సహా వివిధ రూపాలను కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా షారుఖ్ ట్విటర్‌లో ఆస్క్ SRK సెషన్‌ను హోస్ట్ చేశారు. ఈ సెషన్ లో పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు షారుఖ్ ను పలు ప్రశ్నలు అడిగారు. సల్మాన్ తన కొత్త లుక్ తో కనిపించడం వెనుక ఉన్న కారణాన్ని గురించి అడిగారు. సల్మాన్ 'జవాన్‌'ను ప్రమోట్ చేస్తున్నారా అని అడిగిన అభిమానుల ప్రశ్నకు షారుఖ్ కూడా సమాధానమిచ్చారు.

Ask SRK సెషన్‌లో, ఒక అభిమాని షారూఖ్‌ను ఇలా అడిగాడు.. "@iamsrk సర్.. సల్మాన్ భాయ్ తాజా లుక్ అతను జవాన్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు చెబుతోంది, ఇది నిజమేనా? #asksrk" అని. దానికి సమాధానంగా, సల్మాన్ తనపై తనకున్న ప్రేమను చూపించడానికి ఎలాంటి రూపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని SRK చెప్పారు. షారుఖ్ చెప్పిన సమాధానం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా ఇటీవల, షారుఖ్ ఖాన్ తన కొత్త మూవీ 'జవాన్' కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో షారుఖ్ అనేక లుక్స్ కనిపించాయి. జవాన్ లో SRK అన్ని బహుముఖ అవతార్‌లను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువస్తూ, పోస్టర్ సినిమాలోని ఐదు విభిన్న రూపాలను అద్భుతంగా ప్రదర్శించింది. ప్రతి ముఖం వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. అయితే ఇది ప్రారంభం మాత్రమే... ఏస్ కోసం వేచి ఉండండి!!!" అంటూ షారుఖ్ క్యాప్షన్ లో రాసుకువచ్చారు.

'జవాన్' గురించి

అట్లీ దర్శకత్వం చేసిన 'జవాన్' యాక్షన్ థ్రిల్లర్ లో షారూఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార, సన్యా మల్హోత్రా, ప్రియమణి నటించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించింది. ఇది సెప్టెంబర్ 7, 2023న థియేటర్లలోకి రానుంది.


Tags

Next Story