Ram Charan Game Changer : ఈ పాట గేమ్ ను ఛేంజ్ చేసిందా..

Ram Charan Game Changer :  ఈ పాట గేమ్ ను ఛేంజ్ చేసిందా..
X

పాటలకు వచ్చే హైప్ సినిమాలపై అంచనాలను పెంచుతుంది. అందుకు తగ్గట్టుగా కంటెంట్ ఉంటే కమర్షియల్ గా హిట్స్ కొడతారు. ఇది అన్ని సినిమాలకూ వర్తిస్తుంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు అనేది నిజం. తమన్ సంగీతం అందించిన ఈ పాటలన్నీ దాదాపు విన్నవే కదా అనిపించాయి. అయితే రీసెంట్ గా వచ్చిన మెలోడీ సాంగ్ మాత్రం అదిరిపోతుంది అని చెప్పారు. పాటకు ముందే సింగర్స్ కార్తీక్, శ్రేయాఘోషన్ తో కలిపి విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంది. అయితే వాళ్లు చెప్పినట్టుగా ఈ పాట ఆడియన్స్ కు అడిక్ట్ అయ్యేలా చేసిందా అంటే ఖచ్చితంగా అవును అని మాత్రం చెప్పలేం.

మ్యూజిక్ పరంగా బావుంది. కంపోజిషన్ అదిరింది. సూతింగ్ మెలోడీ అనిపిస్తోంది. పాటలో విజువల్స్ చూస్తుంటే వింటేజ్ శంకర్ కనిపించాడు. ఇటు చరణ్, కియారా అద్వానీ పెయిర్ బ్యూటీఫుల్ గా ఉంది. బట్ ఎక్కడో ఈ పాట క్రౌడ్ పుల్లర్ కాదు కదా అనిపిస్తోందనేది నిజం అంటున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ కు కూడా పెద్దగా కనెక్ట్ కాలేదు అంటున్నారు. అలాగని తీసి పారేసే పాట కాదు. అయినా ఏదో మిస్ అవుతోందే అనేలా ఉంది.

‘‘ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా… గగనాలన్నీ పూల గొడుగులు.. భువనాలన్నీ పాల మడుగులు.. కదిలే రంగుల భంగిమలై కనువిందాయెను పవనములు.. అంటూ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా బావుంది. బట్ ఎక్స్ ల్లెంట్ సాంగ్ అనే టాక్ మాత్రం రాలేదు అనే చెప్పాలి. మొత్తంగా గేమ్ ఛేంజర్ కు ఇప్పటి వరకూ పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. ఈ పాట క్రియేట్ చేస్తుందన బల్ల గుద్ది మరీ చెప్పారు. కాకపోతే ఆ బల్ల థర్మకోల్ తో చేసినట్టున్నారు అనిపిస్తోందనేది మెజారిటి ఆడియన్స్ అభిప్రాయం.

Tags

Next Story