Missamma: 'మిస్సమ్మ'ను మిస్సైన స్టార్ హీరోయిన్.. సావిత్రికి ఫుల్ క్రేజ్..!

Missamma: మిస్సమ్మను మిస్సైన స్టార్ హీరోయిన్.. సావిత్రికి ఫుల్ క్రేజ్..!
టాలీవుడ్‌‌లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ క్లాసిక్‌‌గా మిగిలినవి మాత్రం కొన్నే ఉన్నాయి అందులో ఒకటి 'మిస్సమ్మ'.

టాలీవుడ్‌‌లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ క్లాసిక్‌‌గా మిగిలినవి మాత్రం కొన్నే ఉన్నాయి అందులో ఒకటి 'మిస్సమ్మ'. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో రుపోందిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించారు. సావిత్రి, జమున హీరోయిన్లుగా నటించారు. యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క "మన్మొయీ గర్ల్స్ స్కూల్" అనే హాస్య రచన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు మాటలు, పాటలు అందించగా, సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. ద్వీభాష(తమిళ్, తెలుగు) చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని వందరోజులు పూర్తిచేసుకొని విజయడంఖా మోగించింది. అయితే ఈ సినిమాలో (మేరీ / మహాలక్ష్మి) పాత్రకి ముందుగా సావిత్రిని అనుకోలేదు.. ఆమె చేయాల్సింది సీత పాత్ర.. భానుమతిని (మేరీ / మహాలక్ష్మి) పాత్రకి తీసుకున్నారు. ఆమె పై కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించారు.



అయితే ఓ రోజు సినిమా షూటింగ్ సమయానికి భానుమతి ఆలస్యంగా వచ్చిందని చక్రపాణి ఆమె ఎదుటనే అంతవరకు తీసిన 4 రీళ్లను తగులబెట్టి ఆమెకి ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చి ఇంటికి పంపారు. (ఆ రోజు ఆమె ఆలస్యంగా రావడానికి ఆ సమయంలో ఆమె చేస్తున్న వరలక్ష్మీ వ్రతాలు కారణం అయింది. )ఆ తర్వాత భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకొని సావిత్రి చేయాల్సిన పాత్రకి జమునను తీసుకొని సినిమాను పూర్తి చేశారు చక్రపాణి, ఎల్వీ ప్రసాద్.. ఈ సన్నివేశాన్ని మహానటి చిత్రంలోనూ చూపించారు.

ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో సావిత్రికి అభినయనేత్రిగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తరవాత మళ్ళీ సావిత్రి వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా సావిత్రి చెలామణి అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story