22 Nov 2022 10:01 AM GMT

Home
 / 
సినిమా / NTR: ఎన్టీఆర్ ఇది వరకు...

NTR: ఎన్టీఆర్ ఇది వరకు వద్దనుకున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే.. ఇప్పుడు కూడా..

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో కొన్ని సినిమాలు వదులుకున్నాడు. అతను వదులుకున్న కథలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

NTR: ఎన్టీఆర్ ఇది వరకు వద్దనుకున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే.. ఇప్పుడు కూడా..
X

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో కొన్ని సినిమాలు వదులుకున్నాడు. అతను వదులుకున్న కథలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఒకవేళ ఎన్టీఆర్ కానీ ఆ కథలు చేసి ఉంటే అతని రేంజ్ ఇప్పుడు ఉన్నదానికంటే డబుల్ గా ఉండేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.



కానీ అప్పట్లో మనోడు ఊరమాస్ ఎంటర్టైన్స్ అంటూ వరుసగా డిజాస్టర్స్ చూశారు. మరి అది మళ్లీ రిపీట్ అవుతుందా లేదా అనేది చెప్పలేం కానీ.. లేటెస్ట్ గా మరో కథను మిస్ చేసుకున్నాడు. అతను మిస్ చేసిన స్టోరీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఎస్ చెప్పడం విశేషం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యమేస్తుంది. వీటిలో ప్రధానంగా యూత్ ను మెప్పించే కథలే ఎక్కువగా ఉండటం విశేషం. నితిన్ ను హీరోగా నిలబెట్టిన దిల్ కథ ముందు ఎన్టీఆర్ కే వచ్చింది.



అల్లు అర్జున్ ను స్టార్ మెటీరియల్ అవుతాడనిపించిన ఆర్య కథా ముందు అతని వద్దకే వెళ్లింది. బోయపాటి శ్రీను ఫస్ట్ మూవీ భద్ర, రవితేజ - సురేందర్ రెడ్డిల బ్లాక్ బస్టర్ కిక్ తో పాటు నాగార్జున ఊపిరి, అలాగే మహేష్‌ బాబుకు బ్లాక్ బస్టర్ గా నిలిచిన శ్రీమంతుడు సినిమాల కథలన్నీ ముందుగా ఎన్టీఆర్ కు చెప్పినవే.



వీటిలో కొన్ని కథలను అప్పటి తన ఇమేజ్ కు మ్యాచ్ కావు అని వదిలేసుకుంటే మరి కొన్ని కథలను ఖచ్చితంగా జడ్జ్ చేయలేకపోయాడు. కట్ చేస్తే అవన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మరి ఇప్పుడూ అదే జరుగుతుందా అనేది చెప్పలేం కానీ మరోసారి ఓ కథను వదులుకుంటున్నాడు యంగ్ టైగర్.


ఉప్పెనతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు బుచ్చిబాబు.. తర్వాతి కథను ఎన్టీఆర్ తో మాత్రమే చేస్తాని భీష్మించుకున్నాడు. కానీ ఎన్టీఆర్ కొరటాల శివకే ఓటు వేశాడు. ఆ కథ ఎటూ తేలలేదు. అయిన అతనితోనే సినిమా అంటున్నాడు. కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ ఉంటుంది.



సో.. ఇక బుచ్చిబాబు అదే కథను రామ్ చరణ్‌ కు చెప్పాడనీ.. మైత్రీ మూవీస్ లో సినిమా ఉంటుందని ఆ మధ్యే వార్తలు వచ్చాయి. అది నిజమే అని లేటెస్ట్ గా తెలుస్తోంది. ఎన్టీఆర్ కు చెప్పిన కథనే రామ్ చరణ్‌ ఓకే చేశాడు. అయితే బ్యానర్ మాత్రం మైత్రీ కాదు. ఓ కొత్త బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ ఉంటుందని చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ వదులుకున్న కథ రామ్ చరణ్‌ కు బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Next Story