Kriti Sanon : 'మిమీ'లో పాత్ర కోసం పిజ్జాలు, బర్గర్ లు తిన్న కృతిసనన్

Kriti Sanon : మిమీలో పాత్ర కోసం పిజ్జాలు, బర్గర్ లు తిన్న కృతిసనన్
'మిమీ' కోసం కృతి సనన్ 3నెలల్లోనే అన్ని కిలోల బరువు పెరిగిందా..?

2014లో, కృతి సనన్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి 'హీరోపంతి'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది . 2014 నుండి 2023 వరకు, తన అద్భుతమైన నటనతో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సృష్టించుకుంది. 'మిమీ'లో తన నటనకు గాను సనన్ ఉత్తమ నటి విభాగంలో ఆగస్టు 24న అనౌన్స్ చేసిన 69వ జాతీయ అవార్డులో పురస్కారం అందుకుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె అద్దె తల్లిగా నటించింది.

అయితే, తాజాగా 'మిమీ' మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కృతి సనన్ తన పాత్ర కోసం బరువు పెరిగిందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు, సనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకుంది. దాని గురించి కూడా వెల్లడించింది. 'మిమీ' కోసం తాను 15 కిలోలు బరువు పెరిగానని, ఆ తర్వాత 'పరమ సుందరి; పాటను చిత్రీకరించడంతో ఆ అదనపు కిలోలను తగ్గించుకోవడం తనకు చాలా కష్టంగా మారిందని ఆమె చెప్పింది.

ఆమె 3 నెలల పాటు యోగాతో పాటు వర్కవుట్ చేయడం కూడా మానేసిందని, ఇది ఆమె స్టామినా, ఫ్లెక్సిబిలిటీని ప్రభావితం చేసిందని కృతి సనన్ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో, ఆమె 'పరమ సుందరి' కోసం బరువు తగ్గడానికి వ్యాయామం చేయడం, యోగా చేయడం చూడవచ్చు. సనన్ పంచుకున్న మరో వీడియోలో, చిత్రనిర్మాత లక్ష్మణ్ ఉటేకర్ తన ముఖం గర్భవతిగా కనిపించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఆమె 15 కిలోల బరువు పెరగడం కోసం తాను బర్గర్‌లు, పిజ్జాలను తినాల్సి వచ్చిందని చెప్పింది. అయితే, అది ఆమె స్క్రీన్‌పై 'మిమీ'గా కనిపించేందుకు ఎంతో సహకరించింది.

'మిమీ' మూవీ 2011 లో రిలీజైన మరాఠీ చిత్రం 'మాలా ఆయ్ వ్హసిచీ'కి రీమేక్. ఈ సినిమాలో కృతి సనన్‌తో పాటు, పంకజ్ త్రిపాఠి, సుప్రియా పాఠక్, మనోజ్ పహ్వా, సాయి తమ్‌హంకర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. పంకజ్ త్రిపాఠి సైతం మిమీలో సపోర్టింగ్ రోల్‌లో ఉత్తమ నటుడిగా 69వ జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో మూడు అవార్డులను గెలుచుకుంది. అందులో ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి విభాగాలున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story