సినిమా

Pushpa Trailer Tease : పుష్ప ట్రైలర్ టీజ్‌‌‌లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. క్రేజీ ఛాన్స్ కొట్టేసింది..!

Pushpa Trailer Tease : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ నుంచి వస్తోన్న మూడో సినిమా పుష్ప,.. ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి.

Pushpa Trailer Tease : పుష్ప ట్రైలర్ టీజ్‌‌‌లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. క్రేజీ ఛాన్స్ కొట్టేసింది..!
X

Pushpa Trailer Tease : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ నుంచి వస్తోన్న మూడో సినిమా పుష్ప,.. ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ఆ అంచనాలను మరింతగా పెంచాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ట్రైలర్‌‌ను డిసెంబర్ 06 న రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుందో మేకర్స్ చిన్న ట్రైలర్ టీజ్ పేరుతో యూట్యూబ్‌‌‌లో వదిలారు. 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్‌‌‌‌చల్ చేస్తోంది.

ఇందులో చాలానే క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే ఈ టీజర్‌‌‌‌లో హీరోయిన్ రష్మిక మందన్నా బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో కనిపిస్తోన్న ఓ అమ్మాయి ఇప్పుడు హాట్‌‌టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే దివ్య శ్రీపాద.. గత ఏడాది సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌‌‌‌గా నటించి ఆకట్టుకుంది.. దీనికి ముందు ఆమె చాయ్ బిస్కెట్ ఛానల్ ద్వారా వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ లలో నటించి మెప్పించింది.కలర్ ఫోటో సినిమాతో వెండితెరకి పరిచయమైంది. ఈ సినిమాతో పాటుగా మిడిల్ క్లాస్ అబ్బాయి, హెడ్స్ అండ్ టేల్స్ చిత్రాలలో ఆమె నటించింది.

ఈ క్రమంలో ఆమెకి పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ రావడం గ్రేట్ అని చెప్పాలి. ఇందులో ఆమె రోల్ ఏంటి? ఈ సినిమాతో ఆమె క్రేజ్ ఎలా మారబోతుందో చూడాలి.Next Story

RELATED STORIES