Thangalaan : తంగలాన్ మాళవిక పాత్రకు మొదట అనుకున్న నటి ఎవరో తెలుసా..?

తమిళ్ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా కూడా 100 కోట్ల మార్క్ ను దాటింది. హీరో విక్రమ్ కెరీర్ లో ఇదే ఫస్ట్ 100 కోట్ల సినిమా కావడం విశేషం. కంటెంట్ పై కొన్ని వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చినా.. ఆర్టిస్టుల విషయంలో మాత్రం అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. విక్రమ్ కెరీర్ లోనే ది బెస్ట్ నటన చూపించాడు. పార్వతి నటనా అలాంటి ప్రశంసలే అందుకుంది. అయితే ఆరతి పాత్రలో మాళవిక మోహనన్ ప్రత్యేకంగా కనిపించింది. ఆమె కాస్ట్యూమ్స్, ఆహార్యం భిన్నంగా ఉంటాయి. సరిగ్గా మొహం కూడా కనిపించదు. అయినా ఆ పాత్ర ఇంపాక్ట్ సినిమా అంతా కనిపిస్తుంది. ఓ రకంగా తంగలాన్ లో అత్యంత బలమైన పాత్ర ఆరతిదే. ఆ పాత్రలో మళవిక అద్భుతంగా నటించింది. దర్శకుడి ఆలోచనను వెండితెరపై గొప్పగా ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ కేవలం గ్లామర్ డాళ్ గానే ఉన్న మాళవికను ఈ పాత్రలో ఎంపిక చేయడం దర్శకుడి గట్స్ అనే చెప్పాలి. అయితే ఈ పాత్రకు ముందుగా అనుకున్నది తనను కాదు..
తంగలాన్ ఆరతి పాత్ర కోసం మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను అనుకున్నాడట దర్శకుడు రంజిత్. తనను అప్రోచ్ అయ్యి కథ కూడా చెప్పాడట. అయితే అతను అడిగిన డేట్స్ లోనే రష్మిక పుష్ప 2 చేస్తోందట. దీంతో డేట్స్ ఇష్యూ కారణంగా ఈ మూవీ చేయలేనని చెప్పిందట. ఈ విషయాన్ని పా. రంజిత్ ముంబైలోని కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వూస్ లో చెప్పాడు. సో పుష్ప 2 కారణంగా రష్మిక తంగలాన్ ను మిస్ అయిందన్నమాట. ఒకవేళ రష్మిక ఈ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ.. మరొకరిని ఊహించుకునే ఛాన్స్ ఇవ్వకుండా మాళవికనే అదరగొట్టింది కదా..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com