Dil Raju : పవన్ కళ్యాణ్ పెద్దన్న.. తిడితే పడతాం

గత కొన్ని రోజలుగా టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వ్వవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ హాట్ టాపిక్ కారణమైన వారందరికీ ఒకే లెటర్ తో తిరుగులేని షాక్ ఇచ్చాడు ఏపి డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్. సరిగ్గా తన సినిమా విడుదల టైమ్ లోనే బంద్ ను ప్లాన్ చేయడం వెనక కుట్ర ఉందనే విషయాన్ని క్లియర్ గా తేల్చేస్తూ దాని వెనక ఉన్న వారిని టార్గెట్ చేస్తూ.. ఇకపై ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమలోని ‘వ్యక్తులకు’ఎలాంటి సహాయం ఉండదని తేల్చాడు. అలాగే ఏపిలో థియేటర్ల వ్యాపారం చేస్తున్న వారికి కూడా షాక్ ఇస్తూ.. ప్రతి థియేటర్ లోనూ మౌళిక సదుపాయాల గురించి ప్రభుత్వం ఆరా తీస్తుందని చెప్పాడు. మొన్నటి వరకూ ఓ హడావిడీ చేసిన పరిశ్రమ పవన్ కళ్యాణ్ లెటర్ తో ఒక్కసారిగా దిగొచ్చింది.
నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టాడు. వ్వవహారాన్ని లైట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పాలని చూశాడు. తాజాగా మరో సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ మీట్ లో అతను చెప్పిన మాటలు చూస్తే అసలు సమస్యంతా మీడియానే చేసిందని చెప్పడానికే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అతని మాటల్లో కొన్ని కీలకాంశాలు చూస్తే..
‘ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలి. ఈ నెల 30 న జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ విషయాలు మిగతా సమస్యలు చర్చిస్తాము. పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు మేము పడతాము. పవన్ గారికి మీడియా వల్ల మిస్ కమ్యూనికేషన్ అయ్యింది అందుకే ఆయన హార్ట్ అయ్యారు.. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ గారికి థాంక్స్. 9 రోజులుగా జరుగుతున్న విషయాలకు ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టారు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ కి మీటింగ్ జరిగింది. ఎగ్జిబిటర్స్ షేర్ విధానంకావాలని వాళ్ళు అడిగారు. ఏప్రిల్ 30 న గోల్డ్ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ సమస్యలపై మాట్లాడాము.
ఎగ్జిబిటర్స్ ని 6 నెలలు వాళ్ల లెక్కలు తీసోకొని పరిష్కరిద్దాం అని అనుకున్నాము. తెలంగాణలో 370 థియేటర్స్ వుంటే నాకు 30 వున్నాయి. ఏషియన్ వాళ్లకు 120 వున్నాయి. మిగతా వన్నీ యజమానుల దగ్గరే వున్నాయి.. ’అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
మొత్తంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ తో ఇండస్ట్రీకి చెమటలు పడుతున్నాయి అనేది నిజం. ప్రధానంగా తన సినిమా టైమ్ లో బంద్ నిర్ణయాలు రావడం పవన్ కు ఆగ్రహం కలిగించింది. ఇంతకు ముందు తను చేసిన సహాయాలన్నీ వీళ్లు మర్చిపోవడం బాధనిపించి ఉంటుంది. అందుకే ఆయన ఘాటుగా స్పందించాడు. ఆ స్పందనకు అనుగుణంగానే ఖచ్చితమైన నిర్ణయాలుంటే రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలకు చాలా పెద్ద కష్టాలు తప్పవు అని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com