Dil Raju: దిల్ రాజు ఇంట సంబరాలు.. తండ్రి కాబోతున్న నిర్మాత..!

Dil Raju: దిల్ రాజు ఇంట సంబరాలు.. తండ్రి కాబోతున్న నిర్మాత..!
Dil Raju: లాక్‌డౌన్ సమయంలో దిల్ రాజు.. వైగా రెడ్డి అలియాస్ తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

Dil Raju: టాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరు దిల్ రాజు. మిగతా నిర్మాతలతో పోలిస్తే దిల్ రాజుకు ప్రేక్షకులతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది. ఏ సినిమాను ఏ హీరోతో చేయాలి.. ఏ కథకు ఎంత బడ్జెట్ పెట్టాలిలాంటి అంశాలలో దిల్ రాజు దిట్ట. ప్రస్తుతం అగ్ర హీరోలతో, పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు. ఇదే సమయంలో దిల్ రాజు తండ్రి కాబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

2017లో దిల్ రాజు మొదటి భార్య అనిత.. అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుండి ఆయన ఒంటరిగానే జీవితాన్ని కొనసాగించారు. దిల్ రాజుకు, అనితకు ఓ కూతురు కూడా ఉంది. ఆ కూతురికి కూడా పెళ్లయ్యి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే లాక్‌డౌన్ సమయంలో దిల్ రాజు.. వైగా రెడ్డి అలియాస్ తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

దిల్ రాజుతో పెళ్లయిన తర్వాత తేజస్విని కూడా వీరి నిర్మాణ సంస్థ వ్యవహారాలు చూసుకుంటున్నట్టు సమాచారం. అయితే తాజాగా దిల్ రాజు ఇంట్లో సంబరాలు జరిగాయి. దానికి కారణం తన భార్య తేజస్విని ప్రెగ్నెంట్ అని ఫిల్మ్ సర్కి్ల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై దిల్ రాజు కానీ, తన సన్నిహితులు కానీ ఇంకా ఎవరూ స్పందించలేదు.

Tags

Read MoreRead Less
Next Story