Kiran Abbavaraam : దిల్ రుబా కేసీపిడి.. కిరణ్ అబ్బవరం యాక్షన్ తంటాలు

Kiran Abbavaraam :  దిల్ రుబా కేసీపిడి.. కిరణ్  అబ్బవరం యాక్షన్ తంటాలు
X

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'దిల్ రుబా'. ఈ 14న విడుదల కాబోతోందీ సినిమా. విశ్వ కరుణ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రుక్షర్ థిల్లాన్, కేథీ డేవిసన్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అంతా ప్రామిసింగ్ గానే కనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత కిరణ్ మరో హిట్టు కొట్టబోతున్నాడు అన్నారు. 'క' మూవీ విజయంలో కీలక పాత్ర పోషించిన మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ ఈ చిత్రానికీ సంగీతం అందించాడు. పాటలు కూడా ఓకే అనేలా ఉన్నాయి.

ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి కేసీపిడీ అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను సోమవారం సాయంత్రమే రిలీజ్ చేస్తాం అన్నారు. బట్ ఇవాళ రిలీజ్ అయింది. దీనికి ముందు చాలా హడావిడీ చేసింది మూవీ టీమ్. వీడియో చూస్తే పెద్దగా ఏం లేదు అనిపిస్తుంది.కేవలం ఓ ఫైట్ సీన్ ను ఇంగ్లీష్ పాటతో మిక్స్ చేసి కిరణ్ అబ్బవరం ఇంటెన్స్ ఫైట్ చేశాడు అని చూపించే తాపత్రయం కనిపించింది తప్ప వీడియోలో కొత్తగా ఏం లేదు. జస్ట్ వీరు చదువుకుంటున్న కాలేజ్ క్యాంపస్ లో తన ఫ్రెండ్ ను అవతలి గ్యాంగ్ కొడుతున్నారని తెలిసి హీరో గేట్ కు తాళం వేసి వెళ్లి అందరినీ కొట్టి ఫ్రెండ్ ను కాపాడుకుంటాడు. ఇది అత్యంత పురాతనమైన సన్నివేశం అని తెలుగు సినిమాలు చూసిన అందరికీ తెలుసు. ఆ సీన్ ను కేసీపీడీ అంటూ హడావిడీ చేశారు అంటే కిరణ్.. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో చెప్పినట్టే యాక్షన్ హీరో అయిపోవడానికి పాట్లు పడుతున్నాడని అర్థం అవుతోంది.

అయితే యాక్షన్ హీరో ఎవరైనా కావొచ్చు. అసలు మాస్ అయినా క్లాస్ అయినా కథల్లో నుంచే పుడతారు. ఇలా కేసీపీడిల్లో నుంచి కాదు అని తెలుసుకుంటే బెటర్. కథలే హీరోల ఇమేజ్ లను డిసైడ్ చేస్తాయి తప్ప ఒకటీ అరా ఫైట్ సీన్స్ కాదు. ఏదేమైనా ఈ వీడియో చూస్తే ఇదేదో మేకింగ్ వీడియోలా ఉందే తప్ప ఓ యాక్షన్ సీన్ లో ఉండే ఇంటెన్సిటీ అస్సలే లేదు. ఇక ఇంగ్లీష్ పాట అంటారా.. ఆ పాట మాస్ లో ఎంతమందికి అర్థం అవుతుందో వారికే తెలియాలి.

Tags

Next Story