Dimple Hayathi: యాక్షన్ హీరోతో 'ఖిలాడి' భామ.. డింపుల్‌కు బంపర్ ఆఫర్..

Dimple Hayathi (tv5news.in)
Dimple Hayathi: ఖిలాడి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన భామలు డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి. వీరిద్దరు ఇంతకు ముందు కూడా సినిమాల్లో నటించినా.. ఖిలాడి మాత్రం వీరికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అటు గ్లామర్, ఇటు నటనను బ్యాలెన్స్ చేస్తూ.. వారు ఖిలాడిలో అందరినీ ఆకట్టుకున్నారు. అందుకే అప్పుడే డింపుల్ హయాతి ఖాతాలో ఓ కమర్షియల్ సినిమా వచ్చిపడింది.
డింపుల్ హయాతి గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది.. 'గద్దలకొండ గణేష్'లో తాను చేసిన జర్రా జర్రా అనే స్పెషల్ సాంగే. ఆ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ.. హీరోయిన్‌గా అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇంత టైమ్ పట్టింది. ఫైనల్‌గా ఖిలాడిలో కూడా మరోసారి తన డ్యాన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది డింపుల్. అలా తన పర్ఫార్మెన్స్‌తో తెలుగులో హీరోయిన్‌గా మరో ఛాన్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్.. మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' అనే సినిమా చేస్తు్న్నాడు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. దీని తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని సైన్ చేశాడు గోపీచంద్. అయితే ఇందులో హీరోయిన్‌గా డింపుల్ హయాతిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే మాస్ మహారాజ్‌తో జతకట్టిన డింపుల్.. ఇక త్వరలోనే యాక్షన్ హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com