సినిమా

Dimple Hayathi : బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్..!

Dimple Hayathi : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

Dimple Hayathi : బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్..!
X

Dimple Hayathi : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉందని, దానిలో హాట్ బ్యూటీ డింపుల్ హయతి బాలయ్యతో కలిసి స్టెప్పులు వేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ కోసం డింపుల్ హయతి కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఐతే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. జైబాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అఖండ లాంటి భారీ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలోనే ఉన్నాయి.

Next Story

RELATED STORIES