Anudeep KV : రవితేజను వదిలేసిన అనుదీప్

Anudeep KV :  రవితేజను వదిలేసిన అనుదీప్
X

మాస్ మహారాజా సినిమాల దూకుడు చూస్తే ఏ దర్శకుడైనా వెళ్లి కథ చెప్పొచ్చు అన్నట్టుగా ఉంటుంది. అయితే అతను ముందు కథ చెప్పిన దర్శకులను కాదని తర్వాత వచ్చే దర్శకులను ఓకే చేస్తుంటాడు. అదేమంటే కథ నచ్చలేదు మార్పులు చేయమని ఆ దర్శకులను ఇబ్బంది పెడుతుంటాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇంకా చెబితే ఆల్రెడీ కమిట్ అయిన దర్శకుల లిస్ట్ పెద్దగా ఉన్నా.. ఎవరైనా కొత్తగా వచ్చి తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేస్తాం అంటే చాలు.. కథను కూడా పట్టించుకోకుండా ఓకే చెబుతుంటాడు. ఈ కారణంగానే కొన్నాళ్లుగా కొత్త దర్శకులతో పనిచేస్తున్నా.. ఫ్లాపులు చూస్తున్నాడు. తాజాగా రవితేజ బాధితుడుగా మిగిలాడు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్.

జాతిరత్నాలు మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన అనుదీప్ ఆ వెంటనే తమిళ్ హీరో శివకార్తికేయన్ తో ప్రిన్స్ అనే మూవీ చేశాడు. కాన్సెప్ట్ బానే ఉన్నా.. కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు అన్నారు. తర్వాత రవితేజతో సినిమా ఓకే అయింది. సితార బ్యానర్. దీంతో అనుదీప్ మరో మంచి ఎంటర్టైనర్ తీస్తాడు అని భావించారు. బట్ ఇక్కడే రవితేజ మార్క్ టైమ్ టార్చర్ చూశాడు అనుదీప్. ఫస్టే స్టోరీ ఓకే అయినా.. తర్వాత వచ్చిన దర్శకులకు డేట్స్ ఇవ్వాలని అదే పనిగా స్టోరీలో మార్పులు చెబుతూ వస్తున్నాడట. అప్పటికీ రవితేజ చెప్పిన మార్పులన్నీ చేసుకుంటూ వెళ్లాడు అనుదీప్. అయితే తాజాగా అతనికి యాక్సిడెంట్ కావడం.. ఇంకా గ్యాప్ రావడంతో వచ్చే యేడాది సెకండ్ హాఫ్ లో సినిమా చేస్తా అని చెప్పాడట. దీంతో విసుగొచ్చిన అనుదీప్ అసలు ఆ ప్రాజెక్ట్ నే క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ.. సితార బ్యానర్ లో రావాల్సిన రవితేజ- అనుదీప్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అందుకు హీరో డేట్సే కారణం అనేది దర్శకుడి వైపు నుంచి వినిపిస్తోన్న మాట. అయితే ఈ కథ గురించి తెలిసిన వాళ్లు మాత్రం మాస్ రాజా భలే సినిమా మిస్ అయ్యాడు అనుకుంటున్నారట. అతను చేస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నారు. సో.. ఈ మూవీ క్యాన్సిల్ కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే వస్తుంది.

Tags

Next Story