Director Anudeep : అనుదీప్ అతి.. సినిమాకు ఏంటీ ఉపయోగం..?

Director Anudeep :  అనుదీప్ అతి.. సినిమాకు ఏంటీ ఉపయోగం..?
X

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు అనుదీప్ కే.వి. జాతిరత్నాలు సినిమా రిలీజ్ కు ముందు సుమ షోలో తను వేసిన జోకులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన సినిమా కూడా కేవలం ఆ తరహా జోక్స్ తోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన ప్రిన్స్ పోయింది. బట్ జాతిరత్నాలుతో పాటు సుమ షో నుంచి అతని ఎడ్యుకేషన్, కాళ్లకు చెప్పులు లేకుండా తిరగడానికి అతను చెప్పిన సిల్లీ రీజన్స్.. ఇవన్నీ వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి అతను ఏ ఫంక్షన్ కు వెళ్లినా, ఇంటర్వ్యూకు వెళ్లినా ఈ ప్రశ్నలు కామన్ అయ్యాయి. కొన్నాళ్లుగా మళ్లీ చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు.

అయితే ఇన్ని రోజుల్లో అనుదీప్ ను ఏ సినిమా ఫంక్షన్ కు గెస్ట్ గా పిలిచినా అతనేం మాట్లాడడు. పైగా ప్రేక్షకుల్లో నుంచి వచ్చే గోల ఒకటి. ఇవి ఆసినిమాకు ఏ మాత్రం ఉపయోగపడకపోగా.. మొత్తం ఫంక్షన్ డిస్ట్రబ్ అవుతుందనేది నిజం. అతను కనీసం ఆ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, టాప్ టెక్నీషియన్స్ ను గురించి కూడా తెలుసుకోడు. ఏదో చెప్పాం అన్నట్టుగా ఒకటీ రెండు పదాలు మాట్లాడ్డం.. వెళ్లిపోవడం.. జరుగుతోంది. అతనికి క్రేజ్ ఉంది. అలాంటి వాడు ఆ సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడితే ప్లస్ అవుతుందనుకుంటారు. అతనేం మాట్లాడకపోగా.. ఆ టైమ్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకే చాలా మీడియా బులెటిన్స్ లో అతని స్పీచ్ ను స్కిప్ చేస్తున్నారు కూడా.

తాజాగా కిష్కింధపురి సినిమా సక్సెస్ మీట్ కు వచ్చాడు. అతను ఏమీ మాట్లాడలేదు. ఈ ఫంక్షన్ కు సాయి దుర్గా తేజ్ తో పాటు అనిల్ రావిపూడి, వశిష్ట, బాబీ వంటి దర్శకులు గెస్ట్ లుగా వచ్చారు. వారంతా మంచి విజయవంతమైన సినిమాలే చేశారు.. చేస్తున్నారు. ఇంకా పెద్ద దర్శకులతో వర్క్ చేస్తున్నారు. వారు సినిమా గురించి బానే మాట్లాడారు. ఆశ్చర్యం ఏంటంటే.. అనుదీప్ ఈ సినిమా చూడను కూడా చూడలేదు. ఓ దర్శకుడై ఉండి.. సక్సెస్ మీట్ కు వస్తున్నప్పుడు సినిమా కూడా చూడకపోవడం ఏంటో మరి. సరే చూడలేదు. చూశానని కవర్ చేస్తూ దొరికిపోయాడు. మరోవైపు ఆ దర్శకులంతా అతనిపై సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా అనుదీప్ లాంటి వారి వల్ల టైమ్ వేస్ట్ తప్ప ఆయా సినిమాలకు పెద్దగా కలిసొచ్చేదేం ఉండదు అనేది క్లియర్ గా అర్థం అవుతున్నప్పుడు కూడా ఇంకా అతన్ని గెస్ట్ గా ఎందుకు పిలుస్తున్నారో కానీ.. అతను ఎవరు పిలిచినా వెళ్లేంత ఖాళీగా ఉన్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది.

Tags

Next Story