Director Bala : భార్యకి విడాకులు ఇచ్చిన స్టార్ డైరెక్టర్..!

Director Bala : అక్టోబర్ 2న టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించగా, ఈ ఏడాది ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ కూడా విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. ఇప్పుడు తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా మరియు అతని భార్య ముత్తుమలర్ (మలార్ అని పిలుస్తారు) మార్చి 5న ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో బాలా, మలార్ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
చెన్నైలోని కుటుంబ న్యాయస్థానం వారికి గత వారం విడాకులు మంజూరు చేసింది. వీరి విడాకుల వార్త సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరినీ షాక్‌కి గురి చేసింది. కాగా వీరికి ప్రార్థన అనే పాప ఉంది. చాలా సంవత్సరాల క్రితం దర్శకుడు బాలా మరియు మలర్ మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 5న ఫ్యామిలీ కోర్టులో వారి విడాకులు తీసుకున్నారు.
దర్శకుడు బాలా మరియు ముత్తుమలర్ జూలై 5, 2004న మధురైలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. 18 సంవత్సరాల వివాహ బంధానికి ఇప్పుడు వీడ్కోలు పలికారు. దర్శకుడు బాలా చివరిగా ధృవ్ విక్రమ్ తో వర్మ అనే సినిమాని చేశాడు. ప్రస్తుతం హీరో సూర్యతో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com