Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ షో సక్సెస్.. క్రెడిట్ ఆమెదేనట.. బయటపెట్టిన డైరెక్టర్..

Unstoppable With NBK: అల్లు అరవింద్.. ఇతర ఓటీటీలకు పోటీగా కేవలం తెలుగువారి కోసమే అని 'ఆహా' అనే ఓటీటీని ప్రారంభించారు. మొదట్లో ఆహా స్లోగానే మొదలయిన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బడా ఓటీటీలకు గట్టి పోటీనే ఇస్తోంది. కేవలం తెలుగు కంటెంట్‌తో ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ప్రేక్షకులను మెప్పిస్తుందా అని అనుకున్నవారికి ఆహా సక్సెస్సే ఉదాహరణ. ఇక ఆహాలో అన్నింటికంటే ఎక్కువ సక్సెస్ అయిన బాలయ్య టాక్ షో 'అన్‌స్టాపబుల్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు దర్శకుడు బీవీఎస్ రవి.
బాలకృష్ణ ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో మాస్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. బాలయ్య అంటే పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అనిపించుకునేలా సక్సెస్ అయ్యారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా బాలయ్య ఎలా ఉంటారో చాలామందికి తెలుసు. కానీ ఆయన ఒక హోస్ట్‌గా సరదాగా కబుర్లు చెప్తూ ఉంటే.. ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. బాలయ్యలో ఆ యాంగిల్‌నే బయటపెట్టింది అన్‌స్టాపబుల్ షో.
ఇప్పటికీ టాలీవుడ్‌లోని ఎందరో యంగ్ హీరోలు హోస్ట్‌లుగా తమ సత్తాను చాటుకున్నారు. వారితో పాటు సీనియర్ హీరో నాగార్జున కూడా హోస్ట్‌గా బిజీ అయ్యారు. మరి బాలయ్య హోస్టింగ్ ఎలా ఉంటుందో అని ఎదురుచూసిన ప్రేక్షకులకు అన్‌స్టాపబుల్ షో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందించింది. అయితే ఈ అన్‌స్టాపబుల్ షో సక్సెస్ వెనుక ఉన్నదెవరో దర్శకుడు బీవీఎస్ ఇటీవల రివీల్ చేశారు.
బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నందమూరి.. అన్‌స్టాపబుల్ షో సక్సెస్‌లో ముఖ్య పాత్ర పోషించిందట. ఆహా టీమ్‌తో కలిసి తేజస్విని కూడా అన్‌స్టాపబుల్ కోసం పనిచేసిందట. ఇందులో బాలకృష్ణ లుక్స్ కోసం తేజస్విని చాలా రీసెర్చ్ చేసిందట. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య లుక్స్‌కు, డ్రెస్సింగ్‌కు పూర్తి క్రెడిట్ తేజస్వినిదే అంటున్నాడు దర్శకుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com