రెహమాన్ కోటి రూపాయలు అడిగాడు.. కోటి ఎందుకని 'కోటి'ని పెట్టుకున్నాం..!

రెహమాన్ కోటి రూపాయలు అడిగాడు.. కోటి ఎందుకని కోటిని పెట్టుకున్నాం..!
తెలుగు చిత్రపరిశ్రమలో హాస్య, కుటుంబ కధాచిత్రాలను తెరకెక్కించడంలో తమకి తామే సాటి అనే చెప్పుపునే అతికొద్దిమంది దర్శకులలో ఈవీవీ సత్యనారాయణ ఒకరు.

తెలుగు చిత్రపరిశ్రమలో హాస్య, కుటుంబ కధాచిత్రాలను తెరకెక్కించడంలో తమకి తామే సాటి అనే చెప్పుపునే అతికొద్దిమంది దర్శకులలో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. జంధ్యాల శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈవీవీ ఎక్కువగా హాస్యప్రధానమైన చిత్రాలను తెరకెక్కించారు. చేసిన సినిమాలు దాదాపుగా విజయాన్ని అందుకున్నాయి. స్టార్ హీరోలు ఆయినా, మీడియం హీరో అయినా సరే.. సినిమా మొదటి నుంచి చివరి వరకు తన మార్క్ కనిపించేలా చూసుకుంటారాయన. టైటిల్స్ విషయంలో కూడా కొత్తదనం ఉండేలా చూసుకునేవారు ఈవీవీ. టైటిల్స్‌ను కూడా ప్రేక్షకుడు ఎంజాయ్‌ చేయాలని ఆయన భావించేవారు. ముఖ్యంగా 'పిల్ల నచ్చింది', 'చాలా బాగుంది' చిత్రాలలోని టైటిల్స్ ని చూస్తే భలే తమాషాగా ఉంటాయి. చిరు.. నాగ్‌.. వెంకీ.. బాలకృష్ణ నో చెప్పారని శ్రీకాంత్ ని పెట్టాం, రెహమాన్ కోటి రూపాయలు అడిగాడని కోటి ఎందుకని 'కోటి'ని పెట్టుకున్నాం అంటూ గమ్మత్తుగా ప్లాన్ చేసేవారు ఈవీవీ.
Tags

Read MoreRead Less
Next Story