Girish Malik: ఆ డైరెక్టర్ కుమారుడి మృతి యాక్సిడెంట్ కాదు.. ఆత్మహత్య..!

Girish Malik (tv5news.in)
Girish Malik: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గిరీశ్ మాలిక్ ఇంట హోలీ రోజున విషాదం చోటుచేసుకుంది. తన కుమారుడు మన్నన్ ఐదో అంతస్తు నుండి కింద పడి మరణించాడు. ఈ విషాదానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. మన్నన్ మృతికి సంతాపం తెలియజేశారు. అయితే ఇంతోలనే ఈ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
హోలీ సందర్భంగా బయటికి వెళ్లిన గిరీశ్ మాలిక్ కుమారుడు మన్నన్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అది నచ్చని గిరీశ్ తనను మందలించాడు. ఇద్దరి మధ్య దీని గురించి పెద్ద వాగ్వాదమే జరిగింది. తండ్రితోనే కాకుండా తల్లితో కూడా మన్నన్ దురుసుగా ప్రవర్తించాడు. గొడవ తర్వాత ఎవరి గదిలోకి వారు వెళ్లిపోయారు.
మన్నన్ గది ఐదవ అంతస్థులో ఉంది. తాను కూడా తండ్రితో వాగ్వాదం తరువాత గదిలోకి వెళ్లిపోయాడు. తండ్రి మందలించడం నచ్చని మన్నన్.. తన గదిలో కిటికీలు పగలగొట్టుకొని బయటికి దూకేశాడు. పెద్ద శబ్దం వినిపించడంతో గిరీష్ బయటికి వచ్చి చూశాడు. రక్తపు మడుగులో ఉన్న మన్నన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స మధ్యలో మన్నన్ మృతిచెందాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com