Harish Shankar : హరీష్ మరో రీమేక్.. తెలుగులో ఎవరితో.. ?

Harish Shankar : టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్ట్ గా హరీష్ శంకర్ కి మంచి పేరుంది.. హిందీలో దబాంగ్ మూవీని మంచి మంచి మార్పులు చేసి గబ్బర్ సింగ్ గా తీసి శభాష్ అనిపించుకున్నారు హరీష్.. ఇప్పుడీ డైరెక్టర్ మరో రీమేక్ పైన కన్నేసినట్టుగా తెలుస్తోంది.. 2018లో అజయ్ దేవగన్, ఇలియానా మెయిన్ లీడ్ లో వచ్చిన రైడ్ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు హరీష్ ఆసక్తి చూపిస్తున్నారు.
దీనికోసం ముంబై వెళ్ళిన హరీష్.. పనోరమా స్టూడియోస్ కి వెళ్లి అక్కడ.. రైడ్ ప్రొడ్యూసర్ మంగత్ పాఠక్‌ను కలిసి తెలుగు రీమేక్ రైట్స్ పై సంప్రదించినట్టుగా సమాచారం. హిందీలో అజయ్ దేవగణ్ పోషించిన పాత్రను తెలుగులో ఏ హీరోతో చేస్తారో చూడాలి.. గద్దలకొండ గణేష్ మూవీ తర్వాత మరో సినిమా చేయని హరీష్.. పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకి కమిట్ అయ్యాడు.
ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుండడంతో హరీష్ రైడ్ మూవీ రీమేక్ పైన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com