K. Viswanath : ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు : దర్శకులు విశ్వనాథ్

K. Viswanath : సిరివెన్నెల సీతారామశాస్త్రీ హఠాన్మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా తమను వదిలివెళ్లిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ స్పందించారు. ఇది నమ్మలేని నిజమని, సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటని అన్నారు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయాననిపించిందని, ఇప్పుడు నా ఎడమ భుజాన్ని కోల్పోయానని అన్నారు. . ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన అనుకోకుండా మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే నమ్మశక్యంకావడంలేదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు విశ్వనాథ్. కాగా విశ్వనాథ్ తెరకెక్కించిన సిరివెన్నెల సినిమాకి పాటలు రాసి ఇండస్ట్రీలోకి గేయ రచయితగా అడుగుపెట్టారు సీతారామశాస్త్రీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com