Kalyan Krishna : చైతూ బంగారం.. అంతా దక్షనే చేసింది... డైరెక్టర్ కామెంట్స్..!

బంగార్రాజు మూవీ మ్యూజికల్ ఈవెంట్‌లో హీరో నాగచైతన్య, హీరోయిన్ దక్ష నగర్కర్‌కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఈ వీడియోలో హీరో నాగార్జున స్టేజీ పైన మాట్లాడుతుండగా.. ఏదో సౌండ్ వినిపంచడంతో వెనక్కి తిరిగి చూశాడు చైతన్య.. వెనకే ఉన్న హీరోయిన్ దక్ష.. చైతూ వైపు చూసి కళ్లు ఎగిరేసింది. దానికే చైతూ సిగ్గుపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఈ వీడియో పైన బంగార్రాజు సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మూవీ ప్రమోషన్‌లో భాగంగా స్పందించాడు. చైతన్య స్వభావమే అంతా అని, దేనికైన సిగ్గు పడతాడని చెప్పుకొచ్చాడు.. ఇదంతా దక్ష వల్లే జరిగిందని, చైతన్యది ఏం లేదని, అంతా దక్షనే చేసిందంటూ అమె వైపు చూస్తూ అన్నాడు కళ్యాణ్ కృష్ణ. కాగా దక్ష నగర్కర్ సినిమాలో లడ్డుందా అనే పాటలో కనిపించిన సంగతి తెలిసిందే.
నాగార్జున, చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా మూవీ దూసుకుపోతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియో, జీ స్టూడియో సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి.
• Men Will Be Men 😜#NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT
— ChayAkkineni ™ 🏹 (@massChayCults) January 10, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com