సినిమా

శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు కన్నుమూత ..!

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు కె.ఎస్‌ నాగేశ్వరరావు మృతిచెందారు. హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ రావడంతో తుదిశ్వాస విడిచారు.

శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు కన్నుమూత ..!
X

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు కె.ఎస్‌ నాగేశ్వరరావు మృతిచెందారు. హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ రావడంతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌కి వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలో నాగేశ్వరరావు ఫిట్స్‌కి గురయ్యారు. ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. గుడుంబా శంకర్ దర్శకుడు వీరశంకర్‌ .. కెఎస్ నాగేశ్వరరావుకి మంచి స్నేహితుడు.. ఆయన మరణ వార్తను వీరశంకర్ కూడా ధృవీకరించారు.కె.ఎస్‌ నాగేశ్వరరావుకు ఓ కుమారుడు, కూతురు, భార్య ఉన్నారు.

సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు నాగేశ్వరరావు.. ఆయన కోడిరామకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్‌ని మొదలుపెట్టారు. ఆ తర్వాత కృష్ణంరాజు, జయసుధ జంటగా వచ్చిన 'రిక్షా రుద్రయ్య'తో దర్శకుడిగా మారారు. ఇక దివంగత నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది ఈయనే.. పోలీస్ అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి లాంటి సినిమాలు చేశారు. కె.ఎస్‌ నాగేశ్వరరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


Next Story

RELATED STORIES