sirivennela seetharama sastry: సీతారామశాస్త్రి రైటింగ్‌లో పాట.. ఫోటో షేర్ చేసిన లేడీ డైరెక్టర్..

sirivennela seetharama sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల్లో వినేవారిని అలా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగే మ్యాజిక్ ఉంటుంది. లవ్ సాంగ్ వింటుంటే అదో రకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది, డ్యాన్స్ నెంబర్ అయితే మనకు కూడా లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఒక మోటివేషనల్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాసిన మోటివేషనల్ పాటలు వింటుంటే జీవితం చాలా పెద్దది అన్న విషయం గుర్తొస్తుంది.
సీతారామశాస్త్రి ఇప్పటికే కొత్తగా విడుదలయిన, ఇంకా విడుదల కావాల్సిన ఎన్నో తెలుగు సినిమాలకు పాటలు రాశారు. అందులో ఒకటి 'వరుడు కావలెను'లో 'మనసులోనే నిలిచిపోకే' పాట. ఒక అబ్బాయికి తన ప్రేమను చెప్పలేక అమ్మాయి తనలో తాను మదనపడే పాటలను సిరివెన్నెల చాలా అందంగా ప్రజెంట్ చేస్తారు. అలాగే దీన్ని కూడా చేశారు.
వరుడు కావలెను సినిమాతో లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచమయ్యారు. ఇందులో నాగశౌర్య, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి మధ్య అందమైన మెలోడీ లాగా సాగే పాట మనసులోనే నిలిచిపోకే. ఈ పాటను సిరివెన్నెల ఒక పేపర్ పైన రాసి దర్శకురాలికి అందించారు. ఇప్పుడు ఆ పేపర్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఆయనతో అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com