Ram charan : లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్..!

Ram charan :  లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్..!
Ram charan : ఇటీవల RRR, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.

Ram charan : ఇటీవల RRR, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఐతే ఇప్పుడు మరో కోలీవుడ్ దర్శకుడికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఖైది, మాస్టర్ చిత్రాలతో హిట్స్ కొట్టి మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ చెప్పిన ఓ కథకి రామ్ చరణ్ ఫిదా అయిపోయాడట.

దీనితో అతనితో సినిమా చేసేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి మూవీ తర్వాత చరణ్ ఈ మూవీ చేయనున్నాడట. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ 3న రిలీజ్ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story