Lokesh Kangaraj : సోషల్ మీడియాకు ‘బై’చెప్పిన లోకేష్ కనకరాజ్

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిజానికి అతనేం మరీ అంత యాక్టివ్ గా ఉండడు. అలాగే అతనిపై పెద్దగా నెగెటివ్ కామెంట్స్ కూడా ఉండవు. అయినా ఎందుకు గ్యాప్ ప్రకటించాడు అనేది అర్థం కావడం లేదు చాలామందికి. అయితే మళ్లీ కూలీ ప్రమోషన్స్ టైమ్ కు తిరిగి వస్తా అని చెప్పాడు. అతని దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, సౌబిన్ షబీర్ కీలక పాత్రల్లో నటించిన కూలీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న విడుదల చేస్తాం అని ప్రకటించారు. అదే రోజు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే ఉంటుంది.
మొత్తంగా లోకేష్ నిర్ణయం కూడా సోషల్ మీడియాలోనే వైరల్ అవుతోంది. కొందరేమో.. ఈ గ్యాప్ అజిత్ సినిమాకు కథ రెడీ చేయడం కోసం అంటున్నారు. మరికొందరు కూలీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ డిస్ట్రబ్ కాకుండా చూసుకునేందుకే అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com