Bun Butter Jam : ‘బన్ బటర్ జామ్’ టీజర్.. రిలీజ్

రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వంలో.. సురేష్ సుబ్రమణియన్ సమర్పకుడిగా రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మించిన ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బన్ బటర్ జామ్’ ఔట్ అండ్ ఔట్ కామెడీ గా తమిళ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పైన సిహెచ్ సతీష్ కుమార్ ఆగస్ట్ 8న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం టీజర్‌ను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేసి సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.
‘బన్ బటర్ జామ్’ టీజర్‌ను గమనిస్తే తల్లిదండ్రులైన చార్లి, శరణ్య పొన్ వనన్ తమ కొడుకు గొప్పతనం గురించి మరొకరితో ఫోన్‌లో చెబుతుంటారు. మరో వైపు హీరో క్యారెక్టర్‌ను ఫన్నీగా ప్రజెంట్ చేశారు. అలాగే హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌ను కూడా ఎంటర్‌టైనింగ్ వేలోనే చూపించటం కొస మెరుపు. సునిశితమైన ఎమోషన్, అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టమవుతోంది.
రాఘవ్ మిర్‌దత్ ఫన్నీగా సినిమాను తెరకెక్కించిన తీరు, నివాస్ కె.ప్రసన్న సంగీతం, బాబు కుమార్ సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆగస్ట్ 8న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.హెచ్.సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com