Uday Kiran: మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి గురించి దర్శకుడి ఆసక్తికర కామెంట్స్..

Uday Kiran: ఇప్పుడు హీరోల్లో లవర్ బాయ్ అని పేరు తెచ్చుకున్న హీరోలు చాలా తక్కువ. కానీ ఒకప్పుడు టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఎవరు అనగానే వెంటనే ఉదయ్ కిరణ్, తరుణ్ పేర్లే వినిపించేవి. అందులోనూ ఉదయ్ కిరణ్ కెరీర్ ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండేది. కానీ అప్పుడప్పుడు కొన్ని తప్పు ఛాయిస్‌ల వల్ల వరుస ఫ్లాపులను ఎదుర్కున్నాడు. ఉదయ్ కిరణ్ చివరి సినిమా అయిన 'చిత్రం చెప్పిన కథ' దర్శకుడు మోహన్ ఆల్రక్.. ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
అయితే టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అందుకే టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్‌ను అల్లుడిగా చేసుకోవాలనుకున్నారని మోహన్ ఆల్రక్ అన్నారు. అలా అనుకునే అల్లు రామలింగయ్య.. చిరంజీవిని అల్లుడిని చేసుకున్నారని గుర్తుచేశారు. అందుకే చిరంజీవి కూతురితో ఉదయ్ కిరణ్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది.
చిరంజీవి కూతురితో నిశ్చితార్థం అయిన తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్‌లో డౌన్‌ఫాల్ మొదలయ్యింది. వరుసగా ఫ్లాపులు వచ్చాయి. అదే సమయంలో ఏమైందో తెలీదు కానీ తనంతట తానే మెగాస్టార్ కూతురితో పెళ్లి క్యాన్సిర్ చేశారని మోహన్ ఆల్రక్ తెలిపారు. తనకు అంతే తెలుసని ఆయన చెప్పారు. ఇక ఉదయ్ కిరణ్ చివరి చిత్రం 'చిత్రం చెప్పిన కథ' విడుదల గురించి ఇప్పటికీ ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com